Thursday, March 28, 2024
- Advertisement -

రాజస్థాన్ ఆటగాడు తెవాటియా పై సెహ్వాగ్ ప్రశంశలు..

- Advertisement -

రాజస్థాన్​ రాయల్స్ ఆల్​రౌండర్​ రాహుల్​ తెవాతియాపై టీమ్​ఇండియా మాజీ ఓపెనర్​ వీరేంద్ర సెహ్వాగ్​ ప్రశంసల జల్లు కురిపించాడు. శనివారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్​లో​ తెవాతియ స్టన్నింగ్​ క్యాచ్​కు​ తాను ముగ్ధుడయ్యానని అన్నాడు. ఈ మేరకు అతడిని ప్రశంసిస్తూ ఓ ట్వీట్​ చేశాడు.

తెవాతియా.. మైదానంలో నువ్వు ఏమైనా చేయగలవు. కరోనా వ్యాక్సిన్​ను కనుక్కోమని నీకు ఓ అవకాశం ఇస్తే.. అది కూడా కనిపెట్టేస్తావు. ఈ సీజన్​ నీకు బాగా కలిసొచ్చింది” అని సెహ్వాగ్​ పొగడ్తలతో ముంచెత్తాడు.

ఆర్సీబీతో జరిగిన మ్యాచ్​లో తెవాతియా ఫీల్డింగ్​లో అదరగొట్టాడు. జోరు మీదున్న కోహ్లీ భారీ షాట్​ ఆడాడు. అది బౌండరీ వైపు వెళ్తుండగా తెవాతియా తుపానులా పరుగెత్తుకుంటూ వచ్చి బంతిని గాల్లోకి నెట్టేశాడు. బ్యాలెన్స్​ కోల్పోయి బౌండరీ అవతలికి వెళ్లి మళ్లీ లోపలికి వచ్చి బంతిని అందుకున్నాడు. దీంతో పలువురు క్రికెటర్లు, మాజీలు, అభిమానులు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -