ఐపీఎల్ లో రోహిత్ కెఫ్టెన్ గా సక్సెస్ కు కారణం చెప్పిన లక్ష్మణ్

762
vvs laxman reveals why rohit sharma is most successful ipl captain
vvs laxman reveals why rohit sharma is most successful ipl captain

భారత జట్టు ఓపెనర్, ముంబై ఇండియన్స్ కెఫ్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన కెఫ్టెన్ అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. కెఫ్టెన్ గా ముంబైకి అందించిన నాలుగు ట్రోఫీలే ఈ విషయంను స్పష్టం చేస్తాయి. అయితే ఐపీఎల్‌లో కెప్టెన్‌గా నాలుగు, ఆటగాడిగా ఐదు ట్రోఫీలు అందుకున్న రోహిత్ సక్సెస్‌కు కారణంను టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్షణ్ తెలిపారు.

తాజాగా స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో మాట్లాడుతూ ఈ ముంబై కెఫ్టెన్ పై ప్రశంసలు కురిపించాడు.”రోహిత్ ఒత్తిడిలో కూడా ఎలా ఆడాలో తెలిసిన ఆటగాడు. అదే అతని సక్సెస్ కు ముఖ్యకారణం. పరిస్థితులకు దగ్గట్టుగా అంచనా వేస్తూ ఆడుతాడు. యువకుడిగా ఉన్నప్పుడే ఒత్తిడిలో మ్యాచ్ లను సమర్దవంతగా రోహిత్ ఆడాడు. 2008లో డెక్కన్‌ చార్జర్స్‌ విజయాల్లో రోహిత్‌ ముఖ్య భూమిక పోషించాడు. ఆ సమయంలోనే జట్టుకు సారథ్యం వహించే లక్షణాలు అలవర్చుకున్నాడు. అప్పుడు రోహిత్‌ ఓ యువ క్రికెటర్‌ మాత్రమే. కేవలం టీ20 వరల్డ్‌కప్‌ ఆడిన అనుభవం మాత్రమే ఉంది” అని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు.

’ఐపీఎల్ ప్రారంభ సీజన్ 2008లో డెక్కన్ చార్జెస్ పెద్దగా రాణించలేదు. కానీ రోహిత్ మాత్రం మంచి ప్రదర్శన ఇచ్చాడు. ప్రధానంగా మిడిల్ ఆర్డర్ లో తీవ్ర ఒత్తిడిలో ఆడాడు. ముఖ్యంగా యువ ఆటగాళ్లకు స్పూర్తిగా నిలిచేవాడు’ అని లక్ష్మణ్ అన్నారు. రోహిత్ లో ఓ ఆటగాడిగా ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయని.. కానీ ఒత్తిడ్ని అధగమించడం మాత్రం అతని కళ అని.. ఇదే అతని సక్సెస్ కు కారణం అని లక్ష్మణ్ పేర్కొన్నారు.

Loading...