Thursday, March 28, 2024
- Advertisement -

ఐపీఎల్ ట్రోఫీ పై ఉన్న ఈ పదాలకు అర్థం ఏంటి..?

- Advertisement -

2020 ఐపీఎల్ కి రంగం సిద్ధమయ్యింది.. దుబాయ్ వేదికగా తొలి మ్యాచ్  నేడు ఎంతో కన్నులవిందుగా మొదలుకానుంది.. ఐపీఎల్ చరిత్రలో ప్రేక్షకులు లేకుండా ఈ మ్యాచ్ జరగనుంది..  ఆద్యంతం మ్యాచ్ లు ఇలాగే కొనసాగనుండగా ప్రేక్షలుకు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ క్రికెట్ పై అందరికి తమ తమ జట్లపై భారీ అంచనాలే ఉన్నాయి..

సాధారణంగా అయితే ఐపీఎల్ సీజన్ ఇది కాదు. కానీ కరోనా కారణంగా ఆలస్యంగా ప్రారంభం అవుతోంది. ఎప్పుడు స్టార్ట్ అయితే ఏంటి, అసలు అంటూ ఐపీఎల్ మొదలవుతోంది కదా అని జనాలు కూడా ఈసారి రెట్టింపు ఆసక్తి తో ఐపీఎల్ కోసం ఎదురుచూస్తున్నారు.  సెప్టెంబర్ 19 నుండి ఐపీఎల్ మొదలవనుంది. దానికోసం ప్లేయర్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు.నవంబర్ 10వ తేదీన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈసారి ట్రోఫీ ఎవరికి రాసిపెట్టి ఉందో అని క్రికెట్ అభిమానుల లో డిస్కషన్ నడుస్తోంది. ట్రోఫీ ఎవరికి రాసిపెట్టి ఉంది అనే విషయం వాళ్ల పర్ఫామెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడే ఏం చెప్పలేం. ఇప్పుడు ట్రోఫీ మీద ఏమి రాసి ఉందో తెలుసుకుందాం.

మనలో చాలా తక్కువ మంది ఈ విషయాన్ని గమనిస్తాం. ఐపీఎల్ ట్రోఫీ మీద సంస్కృతంలో ఒక వాక్యం రాసి ఉంటుంది.  ఐపీఎల్ ట్రోఫీ మీద రాసి ఉన్న సంస్కృత వాక్యం “యత్ర ప్రతిభ అవసర ప్రాప్నోతిహి (Yatra Pratibha Avsara Prapnotihi)”. అంటే ప్రతిభ ఉన్న చోట అవకాశం ఉంటుంది లేదా ప్రతిభకి అవకాశం కలిసినప్పుడు (where talent meets opportunity) అని అర్థం అట. ఈ వాక్యాన్ని ఇప్పటివరకు మీరు గమనించకపోతే ఈసారి అబ్జర్వ్ చేయండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -