వికెట్ తీసి చిన్నపిల్లాడిలా గంతులేసిన కోహ్లీ..!

743
when virat kohli takes a wicket in practice match celebrates in style
when virat kohli takes a wicket in practice match celebrates in style

టీమిండియా కెఫ్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ చేయడం చాలా చాలా తక్కువ. బ్యాటింగ్ లో అగ్రశ్రేణిలో ఉన్న కోహ్లీ బౌలింగ్ కు దూరంగా ఉండిపోయాడు. అయితే ప్రాక్టీస్ లో మాత్రం అప్పుడు అప్పుడు బౌలింగ్‌ చేస్తూ కనిపిస్తాడు. టెస్టు మ్యాచ్‌లో టీమ్ బౌలింగ్‌ విభాగం అలసిపోయిన తరుణంలో స్వయంగా బౌలింగ్ చేసేందుకే కోహ్లీ అలా రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తుంటాడు.

2018లో ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లిన భారత్ జట్టు.. అక్కడ నాలుగు టెస్టుల సిరీస్‌ని ఆడే ముందు ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ టీమ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత బౌలర్ల‌పై ఎదురుదాడికి దిగిన బ్యాట్స్‌‌మెన్ నెల్సన్ (100) సెంచరీతో చెలరేగాడు. దీంతో.. కోహ్లీనే స్వయంగా బంతి అందుకుని ఆరు ఓవర్ల పాటు బౌలింగ్ చేసి.. ఎట్టకేలకి నెల్సన్ వికెట్ తీశాడు. కోహ్లీ ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా బంతి విసరగా.. నెల్సన్ మిడాన్ దిశగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు.

కానీ.. షాట్ అతను ఆశించిన విధంగా కనెక్ట్ కాకపోవడంతో మిడాన్ దిశగా బంతి గాల్లోకి లేచిపోయింది. దాంతో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న ఉమేశ్ యాదవ్ అలవోకగా క్యాచ్ అందుకున్నాడు. సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్.. తన బౌలింగ్ లో ఔట్ కావడంతో కోహ్లీ నమ్మలేకపోయాడూ. అందుకే ఆ తర్వాత చిన్నపిల్లాడిలా సంబరాలు చేశాడు. అందుకు సంబంధించిన వీడియోని క్రికెట్ ఆస్ట్రేలియా షేర్ చేసింది. మీరు చూసేండి.

Loading...