ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ధోనీకి చెత్త రికార్డ్ ఉంది.. అదేంటంటే ?

767
Captain, ms dhoni, virat kohli, rohit sharma,
Captain, ms dhoni, virat kohli, rohit sharma,

ఐపీఎల్ లో సక్సెస్ ఫుల్ కెఫ్టెన్లలో ఒకడిగా ఉన్న మహేంద్రసింగ్ ధోనీ. గత కొన్ని సీజన్లుగా ఓ చెత్త రికార్డుని కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్ 2008 నుంచి జరుగుతుండగా.. ఇప్పటివరకు 12 సీజన్లు జరిగాయి. ఈ ఏడాది మార్చి 29 ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంబం కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది.

ఐపీఎల్‌లో ఆడిన ప్రతి సీజన్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్‌ని కెప్టెన్‌గా కనీసం ప్లేఆఫ్‌కి చేర్చిన ధోనీ.. మూడు సార్లు టైటిల్ విజేతగా నిలిపాడు. కానీ టోర్నీ చరిత్రలో అత్యధిక ఓటములు చవిచూసిన కెప్టెన్‌గా కూడా ధోనీనే ఫస్ట్‌ ఉన్నాడు. ఇప్పటి వరకూ 179 ఐపీఎల్ మ్యాచ్‌లకి కెప్టెన్‌గా వ్యవహరించిన ధోనీ 60 శాతం మ్యాచ్‌ల్ని గెలిపించాడు.

కానీ.. 69 మ్యాచ్‌ల్లో మాత్రం అతని కెప్టెన్సీలో టీం ఓడిపోయింది. ఐపీఎల్‌లో అత్యధిక ఓటములు చవిచూసిన కెప్టెన్ల జాబితాని చూస్తే.. ధోనీ 69 పరాజయాలతో మొదటిస్థానంలో ఉండగా.. గౌతమ్ గంభీర్ 57 ఓటములు, విరాట్ కోహ్లీ 55, రోహిత్ శర్మ 42, ఆడమ్ గిల్‌క్రిస్ట్ 39.. ఇలా టాప్ 5లో కొనసాగుతున్నారు.

Loading...