Saturday, April 20, 2024
- Advertisement -

వ‌న్డేల్లో తొలి డ‌బుల్ సెంచ‌రీ సచిన్‌ది కాదా?

- Advertisement -

వ‌న్డేల్లో ఇప్ప‌టి వ‌ర‌కు తొమ్మిది డ‌బుల్ సెంచరీలు న‌మోదైయ్యాయి.తాజాగా పాకిస్థాన్ ఆట‌గాడు ఫకార్‌ జమాన్ 156 బంతుల్లో 24 ఫోర్లు, 5 సిక్సర్లతో డబుల్‌ సెంచరీ సాధించాడు. ఇప్పటికే భారత్‌ నుంచి ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (209, 264, 208) మూడు డబుల్‌ సెంచరీలు సాధించగా.. మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌(219), మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ (200)లు సైతం డబుల్‌ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే.ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది కాని,వన్డే క్రికెట్‌లో తొలి డబుల్‌ సెంచరీ చేసిందీ స‌చిన్ కాద‌ని కొంద‌రు వాదిస్తున్నారు.

వ‌న్డే క్రికెట్‌లో సచిన్‌ కన్నా ముందే ఒకరు డబుల్‌ సెంచరీ నమోదు చేశారు. క్రికెట్‌లో ప్రతీ రికార్డును సచినే పరిచయం చేశాడు.. కానీ డబుల్‌ సెంచరీని మాత్రం ఓ మహిళా క్రికెటర్‌ సాధించింది. ఆమె.. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్‌ బెలిండా క్లార్క్‌. ఓవరాల్‌ అంతర్జాతీయ వన్డేల్లో తొలి డబుల్‌ సెంచరీ సాధించారు. 1997 మహిళా ప్రపంచకప్‌ గేమ్‌ టోర్నీలో ఆమె డెన్మార్క్‌పై 229 పరుగులు చేశారు. 155 బంతులు ఆడిన బెలిండా 22 ఫోర్లతో 229 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఇక పురుషుల వన్డేల్లో తొలి డబుల్‌ సాధించింది మాత్రం సచిన్‌ టెండూల్కరే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -