ధోనీకి చివర్లో అంతగా ఇబ్బంది ఎందుకు పడ్డాడో తెలుసా ?

- Advertisement -

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై సూపర్ కింగ్స్ కి జరిగిన మ్యాచ్ లో ఏడు పరుగుల తేడాతో చెన్నై ఓడిన విషయం తెలిసిందే. ఆఖరి ఓవర్లో చెన్నై విజయానికి 28 పరుగులు అవసరం. ఆ టైంలో కేవలం ఒక్క మ్యాచ్ అనుభవం ఉన్న అబ్దుల్ సమద్‌ చేతికి సన్‌రైజర్స్ బంతిని ఇచ్చింది. ధోనీ క్రీజ్‌లో ఉండటం వల్ల చెన్నై ఖచ్చితంగా విజయం సొంతం చేసుకుంటుందని అభిమానులు అనుకున్నారు.

తొలి బంతి పడకుండానే వైడ్, ఎక్స్‌ట్రాల రూపంలో 5 పరుగులు వచ్చాయి. మిగిలిన ఆరు బంతుల్లో 23 పరుగులు చేస్తే విజయం చెన్నైదే. కానీ ఆ ఓవర్లో చెన్నై 20 రన్స్ మాత్రమే చేసింది. చివరి ఓవర్లలో బ్యాటింగ్ చేయడానికి ధోనీ చాలా ఇబ్బంది పడ్డాడు. 36 బంతుల్లో 47 రన్స్ చేసినప్పటికీ.. ధోనీ తన జట్టును గెలిపించలేకపోయాడు. ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చే ధోనీ.. దాదాపు 40 ఏళ్ల వయసులో.. యూఏఈలోని అధిక వేడిమికి తట్టుకోలేకపోయాడు.

- Advertisement -

గొంతు పొడి బారడంతో దగ్గు మొదలవడంతో మహీ సతమతం అయ్యాడు. వేడిమితో ఇబ్బంది పడిన ధోనీ.. పదే పదే విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. చివరి 8 బంతుల్లో చెన్నై విజయానికి 35 రన్స్ అవసరమైన దశలో ఫిజియో వచ్చి ధోనీని పరీక్షించి వెళ్లాడు. బంతులను బౌండరీలకు పంపడంలో ధోనీ విఫలమయ్యాడు. ఎంత శ్రమించినా.. బ్యాటింగ్ చేయడం కష్టమైంది. దీంతో ధోనీ నాటౌట్‌గా నిలిచినా… ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ రెండోసారి ఓడింది. ధోనీ నాటౌట్‌గా ఉన్నప్పటికీ.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడటం ఓవరాల్‌గా ఇది ఆరోసారి.

ధోనీ-సురేష్ రైనా మధ్య గొడవలు.. అందుకు రైనా ఐపీఎల్ ఆడట్లేదా ?

ధోని పై ఆగ్రహంగా చెన్నై.. ఎందుకంటే..?

డ్రీం 11 సంస్థకు షాక్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం..?

ఢిల్లీ ని క్రుంగదీసిన ఓటమి చాలక.. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కి షాక్..!!

Most Popular

Related Articles

మా బ్యాటింగ్ చాలా దారుణంగా ఉంది.. ఏం చేయలేకపోయాం : ధోనీ

వరుస వైఫల్యం ఎదురుకావడం చాలా బాధగా ఉందని చెనై సూపర్ కింగ్స్ కెఫ్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నారు. శుక్రవారం చెన్నైపై ముంబై ఇండియన్స్ 10 వికెట్లతో ఘనవిజయం సాధించింది....

అప్పుడు ట్రోల్ చేసి ఇప్పుడు జాలి చూపిస్తున్నారా..?

ఎంఎస్‌ ధోని అంటే చిరుతకు మారుపేరు. బ్యాటింగ్‌ సమయంలో ధోని క్రీజులో ఉన్నాడంటే చిరుతలా పరిగెత్తుతాడు. అతని వేగానికి అవతలి ఫీల్డర్లకు రనౌట్‌ చేసే అవకాశం లభించదు అంటే పరిస్థితి...

ధోని పై విరుచుకుపడిన ఇర్ఫాన్ పఠాన్..?

జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ జట్లు పోటీపడిన సంగతి తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌ 165 రన్స్‌ టార్గెట్‌ను ఛేజ్‌ చేయలేక చెన్నై టీం సతమతమయ్యింది....
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...