Friday, April 19, 2024
- Advertisement -

కోహ్లీ, కోచ్ ర‌విశాస్త్రి మెడ‌పై వేలాడుతున్న‌ బీసీసీఐ క‌త్తి… ఇక త‌ప్పించుకోలేరు…

- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా సెమీఫైన‌ల్లో న్యూజిలాండ్ చేతిలో భార‌త్ ఓడిపోవ‌డం బీసీసీఐ సీనియ‌స్ గా తీసుకుంది. కెప్టెన్ , కోచ్ ర‌విశాస్త్రిల‌పై గురి పెట్టింది. ఇప్ప‌టి వ‌ర‌కు టీంలో కోహ్లీ, కోచ్ లు చెప్పిందే సాగింది.టీమిండియాకు చెందిన ప్రతి అంశంలోనూ కోహ్లీ ప్రమేయం ఉంది. జట్టు ఎంపికలో కోహ్లీ అభిప్రాయానికే సెలక్టర్లు విలువ ఇచ్చేవాళ్లన్నది అంద‌రికి తెలిసిందే.

భార‌త్ ఓట‌మితో స‌మీక‌ర‌ణాలు మారిపోయాయి. జ‌ట్టులోని లోపాలపై బీసీసీఐ దృష్టి సారించింది. కోహ్లీ, కోచ్ ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకున్నా బీసీసీఐ పాల‌క మండ‌లి ఇప్ప‌టి వ‌ర‌కు అడ్డు చెప్ప‌లేదు.ప్రపంచకప్ ను దృష్టిలో పెట్టుకుని వారిద్దరికీ స్వేచ్ఛనిచ్చింది. కానీ వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ వంటి జట్టు చేతిలో ఓటమి బీసీసీఐని తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. ఇ్ప‌ప‌టికి కూడా కోహ్లీ, కోచ్‌ను వివ‌ర‌ణ అడ‌గ‌కుంటె జ‌ట్టుపై మ‌రింత ప్ర‌భావం చూపుతుంద‌ని వారిని వివ‌ర‌ణ కోరేందుకు సిద్ద‌మ‌య్యారు.

ఇండియాకు రాగానె వారికి మూడు వ‌ష‌యాల్లో వివ‌ర‌ణ కోర‌నున్నారు బీసీసీఐ మేనేజ్‌మెంట్‌. 1. అంబటి రాయుడ్ని ఎందుకు ఎంపిక చేయలేదు? 2. సెమీఫైనల్ మ్యాచ్ లో ధోనీని ఏడో స్థానంలో ఎందుకు దింపారు? 3. జట్టులో నలుగురు వికెట్ కీపర్లు (కేఎల్ రాహుల్, ధోనీ, పంత్, దినేశ్ కార్తీక్) ఉండాల్సిన అవసరం ఏంటి? అనే ప్రశ్నలు సంధించి వారి నుంచి కచ్చితంగా సమాధానాలు రాబట్టాలని బోర్డు పాలకులు నిర్ణయించినట్టు సమాచారం. ఈనెల 14న కోహ్లీసేన ఇండియాకు రానున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -