Thursday, April 25, 2024
- Advertisement -

ప్రపంచకప్ ఫైనల్: న్యూజిలాండ్ కు కలిసివస్తుందా?..

- Advertisement -

ప్రపంచకప్ చివరి అంకానికి చేరింది. ఈరోజు ఇంగ్లండ్ రాజధాని లండన్ వేదికగా ఫైనల్ జరుగుతోంది. ఈ ప్రపంచకప్ లో ఇంగ్లండ్ పిచ్ లు చాలా జట్ల కొంప ముంచాయి. ముఖ్యంగా వరుణుడి వల్ల చాలా జట్లు నష్టపోయాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లకు వర్షం అడ్డురాకుంటే అవి సెమీస్ రేసులో నిలిచేవి.

ఇక సెమీస్ రెండు రోజులు జరిగి టీమిండియా నష్టపోయింది. తడి పిచ్ పై ఆడి ఓటమితో ఫైనల్ అవకాశాలను కోల్పోయింది. ఇలా ఇంగ్లండ్ లో జరిగిన ప్రపంచకప్ లో మంచి క్రికెట్ కన్నా వాన, పిచ్ ల ప్రభావంతోనే ఫలితాలు తారుమారైన సంఘటనలున్నాయి. పిచ్ లపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి.

తాజాగా ఈ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన ఫైనల్ మ్యాచ్ కూడా లార్డ్స్ మైదానంలో ఔట్ ఫీల్డ్ తడిగా ఉండడం వల్ల లేట్ అయిపోయింది. ఎట్టకేలకు టాస్ వేయగా న్యూజిలాండ్ కెప్టెన్ విలయమ్సన్ టాస్ గెలిచాడు. మరో మాట లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టాస్ గెలవడం న్యూజిలాండ్ కు వరంగా మారింది.

ఈ ప్రపంచకప్ లో ముఖ్యంగా ఇంగ్లండ్ పిచ్ లపై టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్టే. రెండోసారి బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. సెమీస్ లో న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసి గెలిచింది ఇలాగే. ఇంగ్లండ్ కూడా సెమీస్ చేరడానికి వరుసగా టాస్ గెలిచి ఫైనల్ చేరింది. ఇలా ఆట కంటే టాస్, వాన కీలకంగా మారిన నేపథ్యంలో ఈరోజు ఫైనల్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ టీంకు కాసింత అదృష్టం వరించింది.

న్యూజిలాండ్ నిలకడగా ఆడుతోంది. మొదటి 20 ఓవర్లలో వికెట్ నష్టపోయి 88 పరుగులతో ఆడుతోంది. క్రీజులో కెప్టెన్ విలయమ్ సన్ ఉండడంతో ఎంతలేదన్నా న్యూజిలాండ్ కు మొగ్గు ఎక్కువగా కనిపిస్తోంది. అయితే సొంత పిచ్ లు కొట్టిన పిండి అయిన ఇంగ్లండ్ ను అంత తక్కువగా అంచనావేయడానికి వీల్లేదు. మరి ఫైనల్ ఫలితం ఈరోజు రాత్రి తేలుతుంది. అప్పటివరకు ఎదురుచూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -