Thursday, April 25, 2024
- Advertisement -

వ‌రుస దెబ్బ‌ల‌తో కుదేల‌వుతున్న సౌతాఫ్రికా…భార‌త్‌తో మ్యాచ్‌కు స్టార్ బౌల‌ర్ దూరం

- Advertisement -

దక్షిణాఫ్రికా… ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న జట్లలో బ్యాటింగ్‌, బౌలింగ్‌లోనూ బలమైనది. ప్ర‌తిభ ఆట‌గాల్లు ఉన్నా ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ‌క‌ప్‌ను గెల‌వ‌లేక‌పోయింది. ఈ సారి క‌ప్ ల‌క్ష్యంగా దిగిన స‌ఫారీల‌కు మొద‌టి నుంచి క‌ల‌సి రావ‌ట్లేదు. కీలక మ్యాచ్ లు వచ్చేసరికి ఆ జట్టును దురదృష్టం పలకరిస్తుంది. ఒకసారి వరుణుడు, మరోసారి ఆటగాళ్ల వైఫల్యం, ఇంకోసారి డక్వర్త్ లూయిస్… ఇలా సౌతాఫ్రికా పలుమార్లు వరల్డ్ కప్ లో విఫలమైంది.

ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌, బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మరుసటి మ్యాచ్‌ను చేజార్చుకున్న సఫారీలు.. బుధవారం భారత్‌తో జరిగే మ్యాచ్‌లోనైనా నెగ్గి శుభారంభం చేయాలని భావించారు. కాని తాజాగా మ‌రో ఎదురు దెబ్బ త‌గిలింది. ఆ జట్టు స్టార్‌ బౌలర్‌ లుంగి ఎంగిడి గాయంతో ఆ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో లుంగి ఎంగిడి తొడకండరాలు పట్టేయడంతో అర్ధాంతరంగా మైదానాన్ని వీడాడు.భారత్‌తో జరిగే మ్యాచ్‌కు లుంగి ఎంగిడి అందుబాటులో ఉండటం లేదని దక్షిణాఫ్రికా జట్టు మేనేజర్‌ మహ్మద్‌ మూసాజీ స్పష్టం చేశాడు.

మరోవైపు కీలక ఆటగాళ్లు సైతం గాయాలతో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. కెప్టెన్‌ డూప్లెసిస్‌, స్టార్‌ బౌలర్‌ స్టెయిన్‌, బ్యాట్స్‌మెన్‌ ఆమ్లాలు గాయాలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే.ప్రతి జట్టూ 9 మ్యాచ్ లు ఆడనుండగా, ఏడు గెలిస్తే గ్యారెంటీగా సెమీస్ కు చేరుకోవచ్చు. కనీసం ఆరు మ్యాచ్ లు గెలిచిన జట్టుకు సెమీస్ లో ఆడేందుకు అవకాశం రావచ్చు. ఇప్ప‌టికే రెండు మ్యాచ్‌ల్లో ఓడిన జ‌ట్టు భార‌త జ‌ట్టుపై ఓడిపోతె సెమీస్ చేరుకోవాలంటే అద్భుతమే జరగాలి. మూడు మ్యాచ్ లలో ఓటమి తరువాత వరుసగా ఆరు మ్యాచ్ లనూ గెలవడం ఆ జట్టుకు కష్టమే. ఎందుకంటె న్యూజిలాండ్, వెస్టిండీస్, పాకిస్థాన్ వంటి జట్లను దక్షిణాఫ్రికా ఎదుర్కోవాలి. ఈ మూడు జ‌ట్ల‌ను ఎదుర్కోవ‌డం ఆజ‌ట్టుకు క‌ష్టంగానె ఉంటుంది.భార‌త్‌తో గెలిచి గాడిలో ప‌డాల‌ని స‌ఫారీలు చూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -