Thursday, April 18, 2024
- Advertisement -

భార‌త్‌, పాక్‌పై మ్యాచ్‌పై కోహ్లీ ఏమ‌న్నాడంటే…?

- Advertisement -

ప‌ల్వామా ఉగ్ర‌దాడి ఘ‌ట‌న‌తో ప్ర‌పంచ క‌ప్‌లో భార‌త్‌, పాక్ మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గుతుందా లేదా అన్న అనుమ‌నాలు కొన‌సాగుతున్నాయి. ఈ దాడిని దేశ వ్యాప్తంగా ప్రజలంతా ఖండించడంతో పాటు పాక్‌కు సరైన గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వన్డే ప్రపంచకప్‌లో పాక్‌-భారత్ మ్యాచ్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. పాక్‌తో మ్యాచ్ ఆడ‌కుండా బ‌హిష్క‌రించాల‌నే వాద‌న‌పై భిన్నాభి ప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. మ్యాచ్ ఆడ‌టంపై బీసీసీఐ, కేంద్ర తీసుకొనే నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటామ‌ని జ‌ట్టు ప్ర‌ధాన కోచ్ ర‌విశాస్త్రి తెలిపారు. తాజాగా కెప్టెన్ కోహ్లీకూడా దీనిపై స్పందించారు.

సిస్‌తో విశాఖ ప‌ట్నంలో జ‌రిగే టీ20 మ్యాచ్‌కు భార‌త్ సిద్ద‌మ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా మీడియాతో విరాట్ కోహ్లీ మాట్లాడాడు. ప్రపంచకప్‌లో పాక్‌తో మ్యాచ్ ఆడేదీ లేనిది తమ చేతిలో లేదని స్పష్టం చేశాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడతామని కోహ్లీ సమాధానమిచ్చాడు. ప్రస్తుతానికి తమ దృష్టి మొత్తం ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌పైనే ఉందని తెలిపాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -