యువరాజ్ కి ధోనీ, కోహ్లీ వెన్నుపోటు వేశారు : యూవీ తండ్రి వ్యాఖ్యలు

776
yograj comments on ms dhoni and virat kohli
yograj comments on ms dhoni and virat kohli

టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. మాజీ కెఫ్టెన్ ఎంఎస్ ధోనీ, ప్రస్తుత కెఫ్టెన్ విరాట్‌ కోహ్లీలపై ఆరోపణలు చేసారు. ధోనీ, కోహ్లీల వెన్నుపోటు కారణంగా తన కుమారుడు యువరాజ్ వెనకబడిపోయాడని యోగ్‌రాజ్‌ అన్నారు. గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన యువరాజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు సౌరవ్ గంగూలీ నుంచి లభించినంత మద్దతు మరే కెఫ్టెన్ నుంచి లభించలేదని అన్నాడు.

తన ఆల్‌టైమ్ బెస్ట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అని అన్నాడు. ఇక గతంలో కూడా ధోనీ ఎఫ్టెన్స్ పై యోగ్‌రాజ్ విమర్శలు చేయగా.. తాజాగా ఓ ప్రముఖ్య ఛానెల్ తో మాట్లాడుతూ యువరాజ్‌ సింగ్‌ను ఎంతో మంది వెన్నుపోటు పొడిచారని.. అందులో ధోనీ, విరాట్ కూడా ఉన్నారని మండిపడ్డారు. ’ధోనీ, కోహ్లీలతో పాటు సెలెక్టర్లు కూడా యువరాజ్‌కు మద్దతు ఇవ్వలేదు. యువీ ఫామ్‌లోకి వస్తే ఎలా? అనే ఆందోళన అందరిలోనూ కనిపించేది. చాలామంది యువీకి వెన్నుపోటు పొడిచారు.

నిజంగా ఇది అతడిని ఎంతగానో బాధించిందని’ అన్నారు. ఇక 2011 ప్రపంచకప్ సమయంలో సురేశ్ రైనాకు ధోనీ మద్దతు ఎక్కువగా ఉండేదని, తుది జట్టులోకి తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడ్డాడని ఇటీవల యువరాజ్ సింగ్ తెలిపిన ఈ విషయం తెలిసిందే. ఈ కామెంట్స్ పై యోగ్‌రాజ్ మాట్లాడుతూ.. యువరాజ్‌ను తప్పియాలనే ఉద్దేశంతోనే ధోనీ రైనాకు మద్దతు ఇచ్చారని, అప్పట్లో ఈ విషయాన్ని తన వద్ద చాలా మంది ప్రస్తావించారని చెప్పుకొచ్చారు.

Loading...