Saturday, April 20, 2024
- Advertisement -

కోహ్లీ,సచిన్ ను వెనక్కి నెట్టిన ధోని….మోదీ తర్వాత స్థానం మిస్టర్ కూల్ దే

- Advertisement -

వరల్డ్‌కప్ తర్వాత దాదాపు రెండు నెలలుగా క్రికెట్‌కి దూరంగా ధోని ఉంటున్నా…ఆదరణ మాత్రం ఏమాత్రం తగ్గడంలేదు.భారత క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనికి ఉన్న క్రేజ్‌ మరోసారి రుజువైంది.క్రికెట్ ప్రపంచాన్ని రెండు దశాబ్దాలు ఏలిన సచిన్ టెండూల్కర్, ప్రస్తుతం రికార్డుల రారాజుగా విరాజిల్లుతున్న విరాట్ కోహ్లీ‌లను సైతం వెనక్కి నెట్టి మరీ అత్యంత ప్రజాదరణ ఉన్న భారతీయుడిగా ధోనీ నిలిచాడు.

యుగోవ్ సంస్థ ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులకు భారత్‌లో ఎంత అభిమానుం ఉందో సర్వేలో బహిర్గతమైంది.ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 42,000 మందిపై యుగోవ్ సంస్థ ఈ సర్వే నిర్వహించగా.. అత్యంత ప్రజాదరణ కలిగిన భారతీయుడిగా మొదటి స్థానంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిలిచారు.

సర్వేలో మోడీకి 15.66% ఓట్లురాగా.. తర్వాత మహేంద్రసింగ్ ధోనీ 8.58%, రతన్ టాటా 8.02%, అమితాబ్ బచ్చన్ 6.55%, సచిన్ టెండూల్కర్ 5.81%, విరాట్ కోహ్లి 4.46% జాబితాలో టాప్-6లో నిలిచారు ఇక .పోర్చుగీసు ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డోకు భారత్‌లో 2.95 శాతంలో అభిమానులు ఉండటం విశేషం. ఇటీవల ఫిఫా అత్యుత్తమ పురుషుల అవార్డును దక్కించుకున్న అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనల్‌ మెస్సీ కూడా 2.32 శాతం సాధించాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -