నెక్ట్స్ బాల్ గుర్తుందా..? హార్దిక్ దిమ్మతిరిగే కౌంటరిచ్చిన జహీర్ ఖాన్..!

1786
Zaheer Khan Had the Perfect Clap Back to Hardik Pandya
Zaheer Khan Had the Perfect Clap Back to Hardik Pandya

జహీర్ ఖాన్ పుట్టిన రోజు సందర్భంగా రెండు రోజుల క్రితం శుభాకాంక్షలు చెబుతూ హార్దిక్ పాండ్యా ఓ వీడీయో పోస్ట్ చేశాడు. ఆ వీడియోపై విపరితంగా విమర్శలు వచ్చాయి. “పుట్టిన రోజు శుభాకాంక్షలు జాక్. నేను ఇక్కడ కొట్టినట్లు నువ్వు మైదానం బయట కొడతావని అనుకుంటున్నా” అంటూ ఓ టీ -20 పోటీలో జహీర్ బౌలింగ్ లో తాను సిక్సర్ కొట్టిన వీడియోను హార్దిక్ పోస్ట్ చేశాడు.

అయితే ఈ పోస్ట్ పై చాలా విమర్శలు వచ్చాయి. క్రికెట్ ప్రేమికులు హార్దిక్ పై మండిపడ్డారు. తాజాగా దీనిపై జహీర్ ఖాన్ కూడా ట్వీట్ చేస్తూ ఘాటుగా స్పందించాడు. “మొదట జన్మదిన శుభాంక్షలు చెప్పిన నీకు థ్యాంక్స్. నేను నీలా బ్యాటింగ్ చేయలేను.

అయితే, ఇదే మ్యాచ్ తరువాత బంతిలా నేను నా పుట్టిన రోజును బాగా జరుపుకున్నాను” అని అన్నాడు. ఆ మ్యాచ్ లో నెక్ట్స్ బాల్ కు హార్ధిక్ అవుట్ కావడం గమనార్హం. ఇదే టైంలో తన పుట్టిన రోజునాడు విషెస్ చెప్పిన అందరికీ జహీర్ కృతజ్ఞతలు తెలిపాడు.

Loading...