Thursday, April 25, 2024
- Advertisement -

సుకుమార్ బ్రిలియన్స్……. రామ్ చరణ్ ఎక్స్‌లెన్స్….. మాకు నచ్చిందండీ… ఆయ్

- Advertisement -

తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్స్ చాలా చాలా తక్కువ. ప్రస్తుతం అయితే గట్టిగా నలుగరైదుగురు కూడా ఉండరు. పదుల సంఖ్యలో స్టార్ డైరెక్టర్స్ ఉంటే అలా అంటారేంటి అని అంటారా? అనొచ్చు. ఎందుకంటే డైరెక్షన్ అంటే యాక్షన్…..కట్ చెప్పుకుంటూ సినిమాలు తీసుకుంటూ పోవడం కాదు. తెరపైన కొత్తగా……మనసుకు హత్తుకునేలా వేసే ముద్ర. అలాంటి డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నారు? ఒక క్రిష్, ఒక సుకుమార్, ఒక వంగా సందీప్ రెడ్డి, శేఖర్ కమ్ముల, చంద్రశేఖర్ ఏలేటి…..ఇంకా ఎంత మంది ఉన్నారు? ఎక్కువ మంది డైరెక్టర్స్ అందరూ కూడా సినిమాలు తీస్తూ ఎంత ఎక్కువగా క్యాష్ చేసుకుందాం అనుకునే బాపతేగా. మరి డైరెక్షన్ ఏంటో చూపించాలి అని తపనపడే డైరెక్టర్ సుకుమార్ నుంచి సినిమా వస్తుంటే ఎలా ఉంటుంది? రంగస్థలంలా ఉంటుంది. టీజర్‌లోనే తానేంటో చూపించాడు సుకుమార్.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే చాలా సినిమాల్లో యాక్ట్ చేశాడు. కానీ ఏ ఒక్క సినిమాలో అయినా చరణ్ యాక్టింగ్‌ని చూసి…..అద్భుతంగా యాక్ట్ చేశాడ్రా అని అనగలమా? కానీ రంగస్థలం టీజర్ చూసి చెప్పెయ్యగలం. రామ్ చరణ్‌లో ఎంత గొప్ప యాక్టర్ ఉన్నాడు అనే విషయం. చరణ్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ…….అన్నీ కూడా పర్ఫెక్ట్. ఇక దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. ఫైనల్లీ సుకుమార్…….రంగస్థలం టీజర్‌లో కొత్త విజువల్స్ ఉన్నాయి అని చెప్పలేం. కానీ సుకుమార్ బలంగా వేసిన ముద్ర మాత్రం ఉంది. చరణ్ చేత చెప్పించిన డైలాగ్స్ గుర్తుండిపోయేలా వినపడ్డాయి. ఇక కత్తి పట్టుకుని చరణ్ ఎమోషనల్‌గా నడిచొచ్చే షాట్…..ఆ షాట్‌లో కనిపించే విజువల్స్ అయితే హత్తుకుపోతాయి. ఒక ఊర మాస్ షాట్‌తో ఎంతలా థ్రిల్ చెయ్యొచ్చో ఇతర డైరెక్టర్స్‌కి పాఠాలు చెప్పే స్థాయిలో ఉంటుంది ఆ షాట్. మొత్రంగా సుకుమార్ డైరెక్షన్ బ్రిలియన్స్‌తో పాటు రామ్ చరణ్ యాక్టింగ్‌ని కూడా ఎక్స్‌లెంట్‌గా ప్రజెంట్ చేసిన సుకుమార్ మార్క్ సెల్యులాయిడ్‌గా రంగస్థలం రాబోతున్నదని టీజర్‌తోనే చెప్పేశాడు సుకుమార్. ఆల్ ద బెస్ట్ డైరెక్టర్ సర్……

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -