సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి చాలా యాక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. ఆయన ప్రతి రోజు ఏదో ఒక ట్వీట్ తో ఫ్యాన్స్ ని చాల ఖుషీ చేస్తున్నారు. తాజాగా షూటింగ్ సమయంలో ఒక పాటను మళ్లీ మళ్లీ వినాలంటే చిరాకుగా ఉండేది. ఆ పాటను పూర్తిగా వినాలనిపించేది. కాని ఇప్పుడు మాత్రం ఒక పాటను మళ్లీ మళ్లీ రివైండ్ చేస్తూ పాజ్ చేస్తూ ఉంటున్నాను.
ఎందుకో రేపు చెప్తాను అంటూ నిన్న ట్వీట్ చేసిన చిరంజీవి నేడు అందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు. శ్రీజ చిన్న కూతురుతో ఉన్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీజ కూతురు నవిష్కకు ఖైదీ నెం.150లోని మిమ్మీ అనే పాటకు ఫ్యాన్ అయ్యింది. ఆ పాటను మళ్లీ మళ్లీ పెట్టాలంటూ తాత చిరంజీవిని కోరుతుంది. టీవీలో ఏం వచ్చినా కూడా మిమ్మీ కావాలంటూ అల్లరి చేస్తుంది.
ఆ పాట వచ్చే సమయంలో డాన్స్ చేయడంతో పాటు తెగ ముసిముసి నవ్వులు నవ్వేస్తుంది. చిరు కూడా పాపకు డ్యాన్స్ స్టెపుల్లు చెబుతూ డ్యాన్స్ నేరుపుతున్నాడు. అదే సమయంలో పాటను ఆపేస్తే ఏడుస్తుంది. పాట పెట్టకుంటే తెగ అల్లరి చేస్తుంది. మొత్తానికి మిమ్మీ పాటతో నవిష్క అడిక్ట్ అవ్వడంను చిరంజీవి ఫన్నీగా తన వీడియోలో చూపించాడు. ఆ పాప కోసమే ఆ పాటను మళ్లీ మళ్లీ వింటున్నట్లుగా చిరంజీవి చెప్పారు.
