మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ.. “భీమ్ ఫర్ రామరాజు” పేరుతో ’ఆర్ ఆర్ ఆర్’ నుండి ఓ వీడియోని డైరెక్టర్ రాజమౌళి తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో కూడా రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ తో చరణ్ ను చూపించిన తీరు ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా ఏ రెంజ్ లో ఉండబోతుందో ఈ వీడియో ద్వారా పక్కా క్లారిటీ వచ్చేసింది.
ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజున కూడా ‘రామరాజు ఫర్ భీమ్’ పేరుతో ఓ వీడియోని రిలీజ్ చేయబోతున్నాడు. మే 20 న ఈ వీడియో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ ఎలా ఉండబోతుంది అన్నదాని పై ఓ క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది. కొమరం భీమ్ పేరుతో ఎన్టీఆర్ ను ఈ వీడియోలో చూపిస్తాడు కాబట్టి… తెలంగాణ యాసలో ఎన్టీఆర్ డైలాగ్ లు ఉండబోతున్నాయట. ఇక చరణ్ వాయిస్ కూడా తెలంగాణ స్లాంగ్ లోనే ఉంటుందని తెలుస్తోంది. అంతే కాదు ఎన్టీఆర్ విజువల్స్ అన్నీ అడవిలో ఉంటాయని సమాచారం.
ఇక ఈ వీడియోలో ఎన్టీఆర్ కూడా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తాడట. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయే రెంజ్ లో ఉంటుందని తెలుస్తోంది. మరి ఇన్ని హైలెట్స్ కలిగిన ఈ వీడియో ప్రోమో ఎన్ని రికార్డులను కొల్లగొడుతుందో చూడాలి. ఇక ఆర్ ఆర్ ఆర్ ను 2021 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా వాయిదా పడింది కాబట్టి సినిమా రిలీజ్ మరింత లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
