‘జబర్దస్త్’ ద్వారా చమ్మక్ చంద్రకు ఎలాంటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. జబర్దస్త్ లో మెయిన్ లీడర్ గా చంద్ర కొనసాగాడు. చంద్ర స్కిట్స్ కు స్పెషల్ ఆడియన్స్ ఉంటారు. వారే ఫ్యామిలీ ఆడియన్స్. ఫ్యామిలీస్ కి ఎక్కువ కనెక్ట్ అయ్యేలా చంద్ర స్కిట్స్ చేస్తూ ఉంటాడు. అందుకే ఆయన స్కిట్స్ కి యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూవ్స్ వస్తూ ఉంటాయి.
అయితే జబర్దస్త్ మొదలైన కొత్తలో అమ్మాయిలు అస్సలు ఉండేవారు కాదు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఎక్కువగా కొడుతున్నట్టు, తన్నుతున్నట్టు కూడా సీన్లు ఉంటాయి. అయితే అమ్మాయిలను తీసుకుంటే.. మేల్ ఆర్టిస్ట్ లు కూడా అంత ఫ్రీగా చెయ్యలేరు అనేది మరో రీజన్. అందుకే డైరెక్టర్స్ కూడా అందుకు ఒప్పుకునే వారు కాదు. అయితే తరువాత చంద్ర టీం లో ఒక అమ్మాయిని తీసుకున్నాడు. చంద్ర చేసేవి చాలా వరకూ ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకునే రాసుకుంటాడు.
కాబట్టి డైరెక్టర్స్ ను ఒప్పించి ఓ అమ్మాయిని తీసుకున్నాడట. ఈమె పేరు సత్య. ‘రాజా ది గ్రేట్’ ‘ఆర్.డి.ఎక్స్ లవ్’ వంటి చిత్రాల్లో కూడా ఈమె నటించింది. అయినప్పటికి ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఈమె చంద్ర టీంలో ఎంట్రీ ఇచ్చాక.. ఆ టీంకి ఉన్న క్రేజ్ డబుల్ డబుల్ అయింది. అయితే ఇప్పుడు చంద్ర, సత్య ఇద్దరూ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి జీతెలుగులో వస్తున్న అదిరింది షోకి జంప్ అయ్యారు. ఇక్కడ కూడా జబర్దస్త్ కు ఎక్కడ తగ్గకుండా స్కిట్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
