Sunday, May 4, 2025
- Advertisement -

రైతన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం

- Advertisement -

శ్రీకాళహస్తి శాసనసభ్యులు శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి తొట్టంబేడు మండలంలోని కేకేజీ రోడ్డు వెంబడి ఉన్న చెరువులు మరియు తెలుగుగంగ కాలువకు సంబంధించిన వాళగలమంద అన్నింటిని కూడా పరిశీలించడం జరిగింది. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా వాలగలమంద కాలువకు సంబంధించి బడుగు బలహీన వర్గాల అయిన బిసిలు,ఎస్సీలు, ఎస్టీ పొలాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇందులో భాగంగా దాదాపు వాలగలమంద కాలువకు సంబంధించిన రిపేర్ కానీ అదే విధంగా మిగిలిన వాటికి సంబంధించి ఇంజనీరింగ్ అధికారులకు, ఇరిగేషన్ అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే ఏదైతే ఈ సీజన్ కు అంతకూడా నీళ్లు నిలబడడానికి అవకాశం ఉంటుందో ఆ కార్యక్రమాలను అన్నీ కూడా వెనువెంటనే పూర్తి చేపట్టమని చెప్పి ఇరిగేషన్ అధికారులుకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

దీనిలో భాగంగా సిద్దేశ్వర హరిజనవాడ, సిద్ది గుంట హరిజనవాడ అదేవిధంగా రాంభట్లపల్లి, కాసారం, గోట్టిపూడి,చియ్యవరం చేమూరు ప్రాంతాల్లో ఉండే చెరువులన్నీ కూడా ఎప్పుడు రెండు పంటలకు నీరు అందుబాటులో చేసే ప్రయత్నంలో భాగంగా గత 30 ఏళ్ళలో చెయ్యని ఈ మొట్టమొదటి ప్రయత్నానికి అందరు కూడా సహకరించాలని, అలాగే నియోజకవర్గంలో తొట్టంబేడు మండలం లో మొదటి ప్రాధాన్యత కింద సస్యశ్యామలంగా ఉన్న అన్ని అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోమని రైతులందరికి చెప్పడం జరిగింది.

పంజామ్ వెంబడి ఉన్న తెలుగుగంగ కెనాల్ వరకూ తన ప్రయాణాన్ని సాగించి అక్కడ ఉన్న రైతన్నలందరితో కుడా మాట్లాడి దీనికి వెంటనే ఈ సీజన్లో వర్షాకాలానికి అంతా కూడా చెప్పట్టవలసిన అన్ని యుద్ధప్రాతిపదిక పనులు కుడా చేపట్టమని సంబంధిత అధికారులకు చెప్పడం జరిగింది. అదేవిధంగా సిద్దిగుంట హరిజనవాడలో కాని, గొట్టిపూడిలో కానీ ప్రతి దగ్గర కూడా త్రాగునీటి సమస్య ఉండకుండా చెయ్యాలని అధికారులను ఆదేశించడం జరిగింది.

రైతన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం త్వరలోనే రైతులందరూ లక్షాధికారులు అవుతారు, ప్రతి రైతు రెండు పంటలు పండించుకునే విధంగా చర్యలు చేపడుతున్నాం అన్నారు MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి.

-Anjanreddy Kodathala

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -