న్యాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధానపాత్రలుగా ఫీల్ గుడ్ మూవీస్ తీసే ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నివేద థామస్ హీరోయిన్ గా ప్రేక్షకుల ముందు వచ్చిన చిత్రం ‘V’.. మొదటినుంచి ఎంతో ఆసక్తి కనపరిచిన ఈ చిత్రం థియేటర్లు మూసివేయడంతో అమెజాన్ ప్రైమ్ లో నేడు రిలీజ్ అయ్యింది.. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందించగా, పి.జి.విందా సినిమాటోగ్రఫీ ని సమకూర్చారు.. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఎలా ఉందో ఈ స్పెషల్ రివ్యూ లో తెలుసుకుందాం..
కథ :
ఓ పోలీస్ ఆఫీసర్ ను అత్యంత కిరాతకంగా చంపేసి కిల్లర్ (నాని) ని పట్టుకోవడానికి డీసీపీ ఆదిత్య (సుధీర్ బాబు) ఎలా పట్టుకున్నాడనేదే ఈ సినిమా అసలు కథ.. ఆదిత్య కి సవాల్ విసురుతూ కిల్లర్ చెప్పి మరీ హత్యలు చేస్తుండం తో ఈ ఇద్దరి మధ్య ఎంతో ఆసక్తికరమైన ట్రాక్ నడుస్తుంది.. ఇంటెలిజెంట్ క్రిమినల్ ని ఒక బ్రిలియంట్ పోలీస్ ఆఫీసర్ ఎలా పట్టుకున్నాడనే లైన్ పైనే సినిమా మొత్తం సాగుతుంది. మరి చివరికి కిల్లర్ ని ఆదిత్య పెట్టుకున్నాడా..?అసలెందుకు ఆ కిల్లర్ హత్యలు చేస్తున్నట్లు..? అసలు V అంటే ఏమిటన్నది సినిమాలో చూడాల్సిందే..
నటీనటులు :
ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నాని గురించే.. తొలిసారి విలన్ షేడ్స్ ఉన్న వెరైటీ కథలో నటించాడు నాని..గత సినిమా పోలికలు ఎక్కడ కనిపించలేదు.. సీరియస్ యాక్షన్ తో ఆద్యంతం కొత్త నటన చూపించి అభిమానులను అలరించాడు.. ఇక ఈ సినిమా కి సుధీర్ బాబు హైలైట్.. ఇంట్రడక్షన్ ఫైట్ తోనే సుధీర్ బాబు అదరగొట్టాడని చెప్పొచ్చు.. డాన్స్ ల్లోనూ ఇర్రగదీసే స్టెప్స్ వేశాడు.. ఇక నటనలో ఎంతో పరిణితి కనబరిచాడు.. నివేదా థామస్ సుధీర్ ప్రియురాలిగా ఆకట్టుకుంది.. ఈ సినిమా కి ప్రాణం అదితి రావు పాత్ర.. ఈ పాత్రలో ఆమెను తప్ప ఎవరిని ఊహించుకోలేమనేలా చేసింది.. ఇక మిగిలిన పాత్రలు పర్వాలేదనిపించాయి..
సాంకేతికవర్గం :
ఈ సినిమా ని దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఒక్కడే భుజాన వేసుకున్నట్లు కనిపిస్తుంది.. ప్రతి విషయంలో చాలా క్లీన్ గా సినిమా తీశాడు. ఎక్కడ చిన్న రిమార్క్ కూడా లేదు.. కానీ స్టోరీ పైనే ఇంకాస్త వర్క్ అవుట్ చేస్తే బాగుండేదనిపిస్తుంది.. నాని లాంటి హీరో తో ఇలాంటి సీరియస్ యాక్షన్ ప్రయోగం చేసినప్పుడు ఎంత లేదన్నా కామెడీ కి ఆస్కారం ఉండదు కాబట్టి కొంచెం స్టోరీ పరంగా మంచి వర్క్ చేసి ఉండాల్సింది. నాని, సుధీర్ బాబు ల మధ్య వచ్చే సీన్స్ ని చాల బాగా డిజైన్ చేశారు.. ఈ సినిమాకు పాటలను అమిత్ త్రివేది అందించారు. మొత్తం నాలుగు పాటలు. అన్నీ బాగున్నాయి. అయితే, నేపథ్య సంగీతం థమన్ సమకూర్చారు. థమన్ తన స్టైల్లోనే బీజీఎం చాలా బాగా ఇచ్చారు. కానీ, థీమ్ మ్యూజిక్ మాత్రం నిరాశపరిచింది. ఇది ‘రాక్షసుడు’ థీమ్ మ్యూజిక్‌ను గుర్తుచేస్తుంది. సినిమాలో మూడు, నాలుగు చోట్ల ‘రాక్షసుడు’ బీజీఎం మన మైండ్లోకి వచ్చేస్తుంది. అయితే, సౌండ్ మిక్సింగ్ చాలా బాగా చేశారు. మొబైల్లో సినిమా చూసినా ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే డీటీఎస్ థియేటర్లో చూసిన ఫీల్ కలుగుతుంది. పి.జి.విందా సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ విలువల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు.
టాగ్ లైన్ : ” V ” We All Know The Story
Rating : 2.75/5
