Tuesday, April 30, 2024
- Advertisement -

అక్కడ టీడీపీ బరిలోకి దిగుతుందా..?

- Advertisement -

చంద్రబాబు రాజకీయాల్లో ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు.. నలభై ఏళ్లుగా రాజకీయం లో ఉండి చంద్రబాబు  కు ఏమాత్రం కూడా తెలియకపోతే ఎలా.. అందుకే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయన చెరగని ముద్ర వేస్తున్నారు.. ఇక ఇప్పుడు జగన్ ను విమర్శించడంలోనూ చంద్రబాబు తన అనుభవాన్నంతా రంగరిస్తున్నారు.. గతంలో ప్రజలకు చేయని సేవనంత ఇప్పుడు జగన్ విమర్శించడం పై పెడుతున్నారు.. ఇక ఆంద్రప్రదేశ్ లో తిరుపతి  పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నికలు ఊపు మొదలైంది.. అన్ని పార్టీ లు అక్కడ పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార పార్టీ వైసీపీ, ఇప్పుడిప్పుడే బలపడుతున్న బీజేపీ పార్టీ లు అక్కడ పాగా వేయాలని చూస్తుండగా టీడీపీ మాత్రం అక్కడ పోటీ చేయకూడదని అనుకుంది..

సిట్టింగ్ ఎంపీ మరణించడంతో పాటు, ఆయనకు ఎక్కువగా టీడీపీతో అనుబంధం ఉండటంతో చంద్రబాబు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై సీనియర్ నేతలతో చర్చించి పార్టీ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశమున్నట్లు వార్తలు వచ్చాయి.. కానీ ఇక్కడ పోటీ చేయాలని టీడీపీ భావిస్తోందట.. టీడీపీ తరపున ఇప్పటికే చాలామందిని అభ్యర్ధులుగా ప్రయోగం చేసేసున్నారు. ఎలాగంటే ప్రతి ఎన్నికలోను ఓ కొత్త అభ్యర్ధిని రంగంలోకి దింపటంతో పార్టీ పూర్తిగా బలహీనపడిపోయింది. అయితే చంద్రబాబునాయుడు సొంతజిల్లా కాబట్టి ఎవరినో ఒకరిని పోటికి దింపకపోతే పరువు సమస్య.ఈ  విషయాలను దృష్టిలో ఉంచుకునే సోమిరెడ్డి టీడీపీ పోటి చేస్తుందని ప్రకటించినట్లుంది. అంటే అభ్యర్ధి తేలకపోయినా పోటికి మాత్రం తెలుగుదేశంపార్టీ రెడీ అయిపోయిందన్నమాట.

ఇప్పటికే  బీజేపీ భజన చేస్తూ వారికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు..  తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్ధతు ప్రకటించడం ద్వారా ఒకవైపు తన పరువు నిలుపుకునే యత్నం, రెండో వైపు బీజేపీ అధిష్టానానికి చేరువయ్యే మార్గం దక్కుతుందని చంద్రబాబు ఆశిస్తున్నారు.  చంద్రబాబు ప్లాన్ అయితే బాగుంది కానీ తాము అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బీజేపీ కి టీడీపీ మద్దతు ఎక్కడ అవసరమొస్తుందనేది చూడాలి..

చంద్రబాబు 40 ఇయర్స్ రాజకీయం ఇదేనా…?

జంపింగ్ జపాంగ్‌లను పక్కన పెట్టిన బాబు..!

చంద్రబాబు ఇలాంటి రాజకీయాలు ఎవరికోసం..?

అప్పుడు ప్రతీకారం.. ఇప్పుడు భజన.. ఏదైనా బాబు..బాబే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -