హీరో రాంచరణ్‌కు హైకోర్టులో ఊరట

‘ఎవడు’ సినిమా పోస్టర్లు అసభ్యకరంగా ఉన్నాయంటూ  కోనేరు నాగేంద్రప్రసాద్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హీరో రాంచరణ్‌తేజ, నిర్మాతలపై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పోలీసులు నమోదు చేసిన కేసు విచారణను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

 ‘ఎవడు’ సినిమా పోస్టర్లు అసభ్యకరంగా ఉన్నాయంటూ  కోనేరు నాగేంద్రప్రసాద్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హీరో రాంచరణ్‌తేజ, నిర్మాతలపై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పోలీసులు నమోదు చేసిన కేసు విచారణను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసును కొట్టివేయాలని రాంచరణ్‌తేజ, దిల్‌రాజు దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ కేజీ శంకర్ సోమవారం విచారించారు.