Tuesday, May 6, 2025
- Advertisement -

ముందస్తు ఎన్నికలు వస్తే లాభం ఎవరికి ?

- Advertisement -

ఏపీలో గత కొన్ని రోజులుగా ముందస్తు ఎన్నికలపై చర్చ జరుగుతున్నా సంగతి తెలిసిందే. ప్రతిపక్ష టీడీపీ పార్టీ ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తోంది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్దంగా ఉండాలని టీడీపీ శ్రేణులను చంద్రబాబు తరచూ హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇక పవన్ కల్యాణ్ కూడా ముందస్తు ఎన్నికల విషయాన్ని అడపా దడప ప్రస్తావిస్తూనే ఉన్నారు. అయితే అధికార వైసీపీ పార్టీ మాత్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని, సాధారణ స్థితిలోనే ఎన్నికలు జరుగుతాయని వైసీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికి కూడా ముందస్తు ఎన్నికలకు సంబంధించిన చర్చ మాత్రం ఆగడం లేదు.

తాజాగా మరోసారి ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు ప్రస్తావించారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా టీడీపీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో మరోసారి ముందస్తు ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చారు చంద్రబాబు. 2023 డిసెంబర్ లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. ఈ సంగతి అలా ఉంచితే ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం వల్ల ఏ పార్టీకి లాభం చేకురానుంది అనే దానిపై కొందరు రాజకీయ విశ్లేషకులు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వంపై ఏపీ ప్రజల్లో సానుకూలత ఏ స్థాయిలో ఉందో వ్యతిరేకత కూడా అంతే స్థాయిలో ఉంది. సంక్షేమ పథకాల అమలు విషయంలో జగన్ ప్రభుతావ్నికి తిరుగులేకపోవడంతో ఇది వైసీపీ సానుకూలంగా మరానుంది. అయితే రోడ్ల విషయంలోనూ, పెట్టుబడులను ఆకర్షించడంలోను జగన్ సర్కార్ ఘోరంగా విఫలం అయిందనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -