టాలోవుడ్ సత్యభామ(జమున) కన్నుమూత

Senior Actress Jamuna Passed Away @ 86
Senior Actress Jamuna Passed Away @ 86

టాలోవుడ్ ప్రముఖ సీనియర్ నటి జమున హైదరాబాద్ లోని స్వగృహంలో (86)కన్నుమూశారు.
1936 ఆగస్టు 30న హంపీలో జన్మించిన జమున 1953లో పుట్టిల్లు అనే సినిమాతో తెరంగేట్రం చేశారు. ఉదయం 11 గంటలకు జమున భౌతికాయాన్ని ఫిల్మ్ చాంబర్ కు తీసుకురానుట్టు సమాచారం.

ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ సినిమాల్లో నటించిన సత్యభామ(జమున).. ‘మీరజాలగలడా’ అంటూ కృష్ణుడ్ని కొంగున ముడేసుకున్న గడుసు ఇల్లాలు సత్యభామ అంటే తెలుగు వారికి జమున గారే గుర్తొస్తారు. ‘దీపావళి’, ‘శ్రీకృష్ణ తులాభారం’ సినిమాల్లో ఆమె సత్యభామగా నటించి తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా ఆ పాత్రను నిలిపారు.