కె. విశ్వనాథ్ మరణం.. ఇండస్ట్రీకి తీరని లోటు !

Legendary Director K Viswanath Passes Away
Legendary Director K Viswanath Passes Away

తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో లెజెండరీ పర్సన్ దివికేగిశారు. ఈ మద్యకాలంలో ఇండస్ట్రీని వరుస మరణాలు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కళాతపస్వి కె. విశ్వనాథ్ కూడా ఇండస్ట్రీకి తీరని అన్యాయం చేస్తూ కన్నుమూశారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 2 ( గురువారం ) తుది శ్వాస విడిచారు. 92 ఏళ్ల కె. విశ్వనాథ్ తన తుది శ్వాస వరకు కూడా కళ కోసమే బ్రతుకుతూ.. చివరి క్షణంలో కూడా తన కొడుకుతో పాట రాయిస్తూ కన్ను మూసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కె. విశ్వనాథ్ మరణ వార్తతో సినీ ఇండస్ట్రీ మొత్తం మూగబోయింది. .

లెజెండరీ దర్శకుడిని కోల్పోయామంటూ దుఖంలో మునుగుతోంది. కె. విశ్వనాథ్ తన సినీ కెరియర్ లో 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలో కూడా కళకే అధిక ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. ఆయన దర్శకత్వం వహించిన శంకరభరణం, సాగరసంగమం, స్వర్ణకమలం, శుభసంకల్పం వంటి ఎన్నొ మరపురాని చిత్రాలు సినీ రంగంలో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేశాయి. 1965లో వచ్చిన ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా ఆరంగేట్రం చేసిన ఆయన.. 2010లో వచ్చిన శుభప్రధం మూవీకి చివరిసారిగా దర్శకత్వం వహించారు. ఆయన సినీ జీవితంలో కేవలం తెలుగు తమిళ్ చిత్రాలకే కాకుండా 9 బాలీవుడ్ సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు.

కాగా దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగా కూడా తనదైన ముద్ర వేశారు కే. విశ్వనాథ్. ఇక 1992లో ఆయనకు పద్మశ్రీ అవార్డ్ తో పాటు రఘుపతి వెంకయ్య అవార్డ్ కూడా వరించింది. అంతే కాకుండా 2017లో దాదాసాహేబ్ ఫాల్కే అవార్డ్ కూడా అందుకున్నారు. ఇక తన సినీ కెరీయర్ లో 5 నందులు, 5 జాతీయ అవార్డులు, 10 ఫిల్మ్ ఫేర్ అవార్డులు కే. విశ్వనాథ్ ను వరించాయి. ఆయన దర్శకత్వం వహించిన శంకరభరణం మూవీకి అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ఈ చిత్రం రిలీజ్ అయి 43 ఏళ్ళు పూర్తి చేసుకున్నా రోజే కే. విశ్వనాథ్ మరణించడం గమనార్హం.