ఆసీస్ పై చెలరేగిన టీమిండియా బౌలర్లు.. టార్గెట్‌ 189 పరుగులు

India Vs Australia: India bowl all out Australia for 188
India Vs Australia: India bowl all out Australia for 188

ముంబయి వాంఖెడే స్టేడియంలో జరుగుతున్న టీమిండియా వర్సెస్ ఆసీస్ తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై టీమిండియా బౌలర్లు నిప్పులు చెరిగారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ టీమిండియా బౌలర్ల ధాటికి 35.4 ఓవర్లలో 188 పరుగులకే ఆలౌట్ అయింది.

టీమిండియా పేసర్లు షమీ, సిరాజ్ చెరో 3 వికెట్లతో కంగారూలను హడలెత్తించారు. జడేజా 2 వికెట్లు తీయగా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 1, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీశారు. ఆసీస్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ మిచెల్ మార్ష్ 81 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ 26, కెప్టెన్ స్టీవ్ స్మిత్ 22 పరుగులు చేశారు. లబుషేన్ (15), గ్లెన్ మ్యాక్స్ వెల్ (8), ఓపెనర్ ట్రావిస్ హెడ్ (5), ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ (12) విఫలమయ్యారు.