రుణమాఫీ లబ్దిదారుల జాబితాను ఏపీ సర్కార్ నవంబర్ 5నప్రకటించనుంది. రుణమాఫీ లబ్దిదారుల జాబితాను పంచాయతీ కార్యాలయాల్లో ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. పదో తేదీ వరకూ అభ్యంతరాలను స్వీకరించనుంది.ఆధార్ కార్డు లేదని సుమారు 18 లక్షలమంది అకౌంట్లను ఏపీ సర్కార్ తిరస్కరించింది. ఆధార్ కార్డుల సమర్పణకు ఈరోజుతో గడువు ముగిసింది.నవంబర్ 15 నుంచి తొలివిడత చెల్లింపులు ప్రారంభం కానున్నాయి.
రుణమాఫీతో 30లక్షల కుటుంబాలకు రుణమాఫీతో లబ్ది కలుగుతుందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేస్తోంది. అయితే ఒక్కరికి, ఒక్క రుణమే మాఫీ చేస్తామనడంతో డ్వాక్రా రుణాలు, పంట రుణాలు, బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాల విషయం ఏమవుతుందోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.