విజయ్ లియోలో మలయాళ నటి…

Malayalam Actress roped in Vijay Lokesh Kanagaraj’s Leo
Malayalam Actress roped in Vijay Lokesh Kanagaraj’s Leo

దళపతి విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ హైప్‌తో తెరకెక్కుతున్నఈ చిత్రం విడుదలకు ముందే రికార్డులు సృష్టించింది. లియో నాన్ థియేట్రికల్ రైట్స్, డిజిటల్ రైట్స్, ఓవర్సీస్ రైట్స్ రికార్డు ధరలకు అమ్ముడుపోయాయి. మనకందుతున్న రిపోర్ట్స్ ఈ సినిమాలో మలయాళ నటి మడోన్నా సెబాస్టియన్ నటిస్తున్నట్టు తెలుస్తుంది.

మడోన్నా సెబాస్టియన్ చివరిగా తమిళ చిత్రం వానం కొట్టటంలో నటించింది. ఆమె తెలుగు వెబ్ సిరీస్ యాంగర్ టేల్స్‌లో కూడా కనిపించింది. లోకేష్ కనగరాజ్ మోస్ట్ ఎవైటెడ్ సినిమా లియోలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. దళపతి విజయ్ 40 ఏళ్ల వయస్సులో గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించబోతున్నారు.

కాశ్మీర్‌లో ఓ చాక్లెట్ ఫ్యాక్టరీని నడుపుతూ గ్యాంగ్ వార్‌ల ప్రపంచానికి దూరంగా ఉట్టున్న విజయ్ తర్వార గ్యాంగ్‌స్టర్ మారునున్నట్టు తెలుస్తుంది. జులై మధ్యలో లియో షూటింగ్ పూర్తి చేయాలని అంటున్నాట. విజయ్ మరియు త్రిషతో పాటు, లియోలో అర్జున్ సర్జా, ప్రియా ఆనంద్, గౌతమ్ మీనన్, మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్ మరియు శాండీ నటిస్తున్నారు. ఈ సినిమాపై తమిళంలోనే కాకుండా తెలుగు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. లియో అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.