అభాగ్యరాలికి శ్రీ సత్య సాయి జిల్లా పోలీస్ చేయూత…

Shri Sathya Sai District Police help the unfortunate woman
SV Madhava Reddy IPS help the unfortunate woman

తోటి పిల్లలు బడికి వెళుతుండటాన్ని చూసి తనకు ఆ అదృష్టం లేదని కుమిలిపోతున్న చిన్నారికి వెన్ను తట్టి నేనున్నానంటూ అండగా నిలిచారు. శ్రీ సత్యసాయి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఐపీఎస్.

శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ గ్రామం, మండల కేంద్రానికి చెందిన లక్ష్మీదేవి, సూర్యనారాయణ దంపతులు నిరుపేదలు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. వారికి ఒక కుమార్తె. పేరు గొల్ల స్రవంతి. వయసు8 సంవత్సరాలు. ఆ నిరుపేద కుటుంబాన్ని విషాదాలు వెంటాడాయి. 3 సంవత్సరాల కిందట సూర్యనారాయణ చెట్టు పై నుండి పడి వెన్నెముక దెబ్బ తినడంతో మంచానికే పరిమితమయ్యారు.

దీంతో లక్ష్మీదేవి కూలి పనులు చేసుకుంటూ వచ్చిన కాస్తంత సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తుండేది. ఆమె సంపాదన భర్త వైద్యానికి, కుటుంబ పోషణకు ఏ మాత్రం సరిపోయేది కాదు. అయినా అష్ట కష్టాలు పడుతుండేవారు. ఈ నేపథ్యంలో ఉన్న కష్టాలు చాలవన్నట్లు మరో పెను విషాదం చోటుచేసుకుంది. కుటుంబాన్ని నడిపిస్తున్న లక్ష్మీదేవి కూడా ఆరు నెలల క్రితం అనారోగ్యంతో కన్నుమూశారు.

ఇక మంచానపడ్డ సూర్యనారాయణ, కుమార్తె 8 ఏళ్ల చిన్నారి స్రవంతి కష్టాలు వర్ణనాతీతమయ్యాయి. ఆ పసిపాప.. మంచానపడ్డ తండ్రికి సపర్యలు చేస్తూ ఉండిపోయింది. రూపాయి సంపాదనలేదు, కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు. వర్షం వస్తే ఆ గుడిసె పూర్తిగా కారుతోంది. దీంతో తండ్రి కూతురు వర్షం వచ్చిన ప్రతిసారి తడిచిపోవాల్సిందే. ఇక చిన్నారి స్రవంతికి ఇరుగుపొరుగువారు ఇచ్చిన బియ్యంతో తండ్రికి వండి పెట్టడం సపర్యలు చేయడమే సరిపోతుంది. పాఠశాలకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. చేతిలో కనీస ఖర్చులకు కూడా చిల్లిగవ్వ లేదు. పాఠశాలకు వెళ్తున్న తోటి చిన్నారులని చూసి తనకు ఆ అవకాశం లేదని కుమిలిపోతుండేది ఆ చిన్నారి పరిస్థితి, ఆ కుటుంబ దుస్థితిని తెలుసుకొని జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వి మాధవరెడ్డి చలంచిపోయారు. ఆ అభాగ్యులకు అండగా నిలవాలనుకున్నారు.

తక్షణమే ఆ కుటుంబానికి దుస్తులు నిత్యావసరాలు అందజేయాలని నల్లమాడ పోలీసులకు సూచించారు. తనవంతుగా రూపాయలు 30,000 చిన్నారి పేరున బ్యాంకు లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఆ చిన్నారిని నల్లమాడలోని రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించి బాలికకు అవసరం అయిన బట్టలు పుస్తకాలు అందజేశారు. బాలిక కుటుంబానికి భవిష్యత్తులో కూడా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమే కాదు కష్టాల్లో ఉన్నవారికి పోలీసులు అండగా ఉంటామని మరి సారిచాటిచెప్పారు.

అలాగే ఇంక ఏవరైన బాలిక కుటుంబానికి సహాయం అందజేయదలసిన వారు
Puttagolusla Sravanthi
A/c 91155144392
APGB NALLAMADA
IFSC APGB0001014
నకు పంపగలరు అని తెలియజేశారు.