Thursday, May 9, 2024
- Advertisement -

లోకేష్ – పవన్ ఏం చర్చించారో తెలుసా?

- Advertisement -

టీడీపీ -జనసేన పొత్తు తర్వాత తొలిసారిగా భేటీ అయ్యారు టీడీపీ నేత నారా లోకేష్‌ – జనసేనాని పవన్. ఇక వీరిద్దరూ తొలిసారి భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకోగా ఈ సమావేశంలో కీలక నేతలు పాల్గొన్నారు. రాజమండ్రి వేదికగా మూడు గంటలపాటు సుదీర్ఘంగా సమావేశం జరుగగా ప్రధానంగా జగన్ సర్కార్‌ని ఎలా కట్టడి చేయాలని అన్నదానిపై చర్చించారు.

అలాగే చంద్రబాబు అక్రమ అరెస్ట్ గురించిన ప్రస్తావన కూడా వచ్చింది. బాబు అరెస్ట్‌ను అంతా ఖండించాలని పవన్ పిలుపునివ్వగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే పొత్తు పెట్టుకున్నానమని వెల్లడించారుజ ఇక ఎప్పటిలాగా ఈ సమావేశంలో చంద్రబాబు వయస్సు ప్రస్తావనకు తెచ్చి సింపతీని గెయిన్ చూసుకోవాలని ఇరు పార్టీల నేతలు ఒక అభిప్రాయానికి వచ్చారు.

వైసీపీ ప్రభుత్వం పోవాలి, జనసేన-టీడీపీ ప్రభుత్వం రావాలి కొత్త స్లోగన్ అందుకున్నారు. చంద్రబాబు బెయిల్‌తో పాటు ఎన్నికలకు 6 నెలల సమయమే ఉండటంతో ఏ విధంగా ముందుకు వెళ్లాలి, పొత్తు నేపథ్యంలో అసంతృప్తులను ఏ విధంగా బుజ్జగించాలని అన్నదానిపై కూడా చర్చ జరిగింది. అలాగే జనసేన కోరుతున్న స్థానాలపై కూడా స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే పవన్ వారాహి యాత్ర, భువనేశ్‌వరి భవిష్యత్తుకు గ్యారెంటీ, నిజం గెలవాలి యాత్రలపై చర్చించారు. నవంబర్ 1న టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణ ప్రకటించనుండగా ఆ కార్యచరణ ప్రజలను ఏ మేరకు ప్రభావితం చేస్తుందో వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -