తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఇవాళ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఢిల్లీ వెళ్లిన రేవంత్…ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్రం నుంచి రావల్సిన నిధులు, పాత బకాయిలు, పెండింగ్ లో ఉన్న బిల్లులపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.
అలాగే విభజన హామీకి సంబంధించిన పెండింగ్ నిధులు, పెండింగ్ ప్రాజెక్టులను మంజూరు చేయాలని కోరారు రేవంత్. రాష్ట్రానికి రావాల్సిన వివిధ రకాల గ్రాంట్లు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం కింద రాష్ట్రానికి నిధులు రావాల్సి ఉంది. వీటిని విడుదల చేయాలని ప్రధాని మోడీని కోరినట్లు తెలుస్తోంది.
గిరిజన వర్శిటీ, పసుపుబోర్డు ఏర్పాటు,మేడారం జాతరను నేషనల్ ఫెస్టివల్‌గా గుర్తిస్తామని బీజేపీ ఎన్నికల్లో హామీ ఇవ్వగా వాటిని నెరవేర్చాలని కోరారు. రేవంత్ పేర్కొన్న అంశాలన్ని విన్న ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.