బాబుపై నార్నే శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్


టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాస్. అయితే ఈ వీడియో పాతదే అయినా ఎన్నికల వేళ సర్క్యూల్ అవుతుండటం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు వల్ల ఆయన సొంత కుటుంబ సభ్యులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఆ వీడియోలో ఆరోపించారు శ్రీనివాస్.

సొంత తమ్ముడినే మోసం చేసిన ఘనుడు చంద్రబాబు అని…తమ్ముడికే టిక్కెట్ ఇవ్వలేదని మండిపడ్డారు. చంద్రబాబు తమ్ముడిని గొలుసులు, తాళ్లతో కట్టేస్తున్నారని వీడియోలో కీలక విషయాలు వెల్లడించారు! అదే సమయంలో.. చంద్రబాబుకు ధమ్మూ, ధైర్యం ఉంటే తన తమ్ముడిని తీసుకొచ్చి ప్రజల ముందు ప్రవేశపెట్టాలని, తాను ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నట్లు శ్రీనివాస్ ఆ వీడియోలో స్పష్టం చేశారు.

తిరుపతిలో చంద్రబాబు సొంత చెల్లెల్లుకు యాక్సిడెంట్ జరిగితే.. ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉండి, హైదరాబాద్ కు షిఫ్ట్ చేసి ట్రీట్ మెంట్ ఇప్పిస్తే.. చంద్రబాబు కానీ, ఆయన సతీమణి కానీ, నారా లోకేష్ కానీ పలకరించలేదని వీడియోలో చెప్పారు. సొంత చెల్లెలు, తమ్ముడి విషయంలో చంద్రబాబు వైఖరి ఎంత దారుణంగా ఉందనే విషయాలు చెబుతూ గతంలో నార్నె శ్రీనివాస్ చేసిన తీవ్ర విమర్శలకు సంబంధించిన వీడియో ఇప్పుడు తెరపైకి రావడం టీడీపీకి ఇబ్బందికరంగా మారింది.