- Advertisement -

కల్తీ పన్నీర్‌ని ఇలా గుర్తుపట్టండి!

- Advertisement -

భారతీయులు విరివిగా ఉపయోగించే వంటకాల్లో ఒకటి పన్నీర్. ముఖ్యంగా వెజ్ లవర్స్‌కి ఇది ఎంతగానో ప్రియమైన వంటకం. పన్నీరులో కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి మూలకాలు అధికంగా ఉంటాయి. అలాగే విటమిన్ బి12, విటమిన్ డి, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి వంటి పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. పన్నీరులో ఉండే మెగ్నీషియం రక్తంలోని కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి గుండెకు ఆరోగ్యాన్ని అందజేస్తాయి.

అయితే మార్కెట్‌లో పన్నీర్‌కు సైతం కల్తీ వచ్చేసింది. ఒరిజినల్ పన్నీర్ వాసన చూస్తే మంచి పాల వాసన వస్తుంది. కొద్దిగా తుంచి రుచి చూస్తే పాల రుచి కనిపిస్తుంది. డూప్లికేట్ అయితే రబ్బర్ లాగా సాగుతూ ఉంటుంది.

అలాగే పనీర్‌ ని కొద్దిగా ఒక పాత్రలోకి తీసుకుని నీరు పోసి వేడి చేసి అందులో నాలుగైదు చుక్కల అయోడిన్‌ వేయాలి. పనీర్‌ నీలం రంగులోకి మారితే అది కల్తీ అని అర్థం. అసలైన పనీర్‌ అయితే రంగు మారదు.

పన్నీర్‌ని నీటిలో ఉడికించిన తర్వాత చల్లటి నీటిలో వేయాలి. అదే నీటిలో కందిపప్పు పది గింజలు వేయాలి. పది నిమిషాల సేపు కదిలించకుండా ఉంచాలి. నీరు లేత ఎరుపు రంగులోకి మారితే ఆ పనీర్‌ కల్తీ అని అర్థం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -