ఈరోజుల్లో ఆడ,మగ అనే తేడా లేదు. అంతా అందానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా అందంగా కనిపించడం కోసం చర్మంతో పాటు ఆరోగ్యానికి హాని చేసే క్రీములను వాడుతున్నారు. ఫలితంగా అందం సంగతి పక్కన పెడితే కొత్త కొత్త వ్యాధుల బారిన పడుతున్నారు. ఇదే తాజా అధ్యయనంలో తేలింది.
ఫెయిర్నెస్ క్రీమ్ లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ క్రీమ్ లు ఎక్కువగా వాడితే మెంబ్రేనస్, నెఫ్రోపతి వంటి వ్యాధులకు కారణమవుతాయట. ఇది మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తాయని వెల్లడైంది. అలాగే ఫెయిర్ నెస్ క్రీములను ఎక్కవుగా వాడటం వల్ల కిడ్నీ సమస్యలు గణనీయంగా పెరుగుతున్నాయని అధ్యయనంలో వెల్లడైంది. ఈ క్రీమ్ లలో అధిక మొత్తంలో పాదరసం ఉండటం వల్ల ఇది మూత్రపిండాల సమస్యలను పెంచడానికి దోహదపడుతుందని తెలుస్తోంది.
అలాగే రోగులు అలసట, మూత్రంలో నురగ వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. కొందరు మెడలో రక్తం గడ్డ కట్టే సమస్యను కూడా ఎదుర్కొంటున్నారట. కొంతమందికి చర్మంపై దద్దుర్లు మరియు చర్మ వ్యాధులు,మతిమరుపు, నిరాశ, ఆందోళన వంటి సమస్యలు వస్తున్నాయని తెలుస్తోంది. అందుకే ఫెయిర్ నెస్ క్రీమ్స్ వాడే వారు ఇకపై జాగ్రత్తగా ఉండండి.
