ఇండస్ట్రీలో రామ్ చరణ్ – ప్రభాస్ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. అరేయ్ అని పిలుచుకునేంత సాన్నిహిత్యం వీరిద్దరి మధ్య ఉంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ తన పాన్ ఇండియా చిత్రం కల్కి 2898ADతో బిజీగా ఉన్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
తాజాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా కల్కి టీమ్ సినీ సెలబ్రిటీల పిల్లలకు గిఫ్ట్ లు పంపుతోంది. రామ్ చరణ్- ఉపాసనల కుమార్తె క్లీంకార కొణిదెలకు కల్కి మూవీ యూనిట్ ఓ బహుమతి అందించింది. అందులో బుజ్జి – భైరవ స్టిక్కర్స్, బుజ్జి బొమ్మ, టీషర్ట్స్ ఉన్నాయి.
ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఉపాసన..చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఇక కల్కి టీం పంపిన గిఫ్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రభాస్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించగా దిషా పటానీ ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.