- Advertisement -

కమిన్స్‌ అరుదైన ఫీట్..సెకండ్ హ్యాట్రిక్

- Advertisement -

ఆసీస్ కెప్టెన్, ఆల్‌రౌండర్ ప్యాట్ కమిన్స్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో భాగంగా ఆఫ్ఘానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. దీంతో ఒకే సిరీస్‌లో రెండుసార్లు హ్యాట్రిక్ తీసిన బౌలర్‌గా అద్భుత ఫీట్ నమోదు చేశాడు. ఇక టీ20 వరల్డ్ కప్ చరిత్రలో రెండు హ్యాట్రిక్‌లు తీసిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు కమిన్స్. అయితే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడిపోవడం విశేషం.

ఇన్నింగ్స్ 18వ ఓవ‌ర్ చివ‌రి బంతిలో అఫ్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్‌ను ఔట్ చేశాడు. ఆ త‌ర్వాత 20వ ఓవ‌ర్‌లో వరుస బంతుల్లో కరీం జనత్, గుల్బాదిన్ నైబ్‌లను ఔట్ చేసి హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కమ్మిన్స్ హ్యాట్రిక్ వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.

ఆస్ట్రేలియా త‌ర‌పున టీ20ల్లో 2007లో బ్రెట్ లీ హ్యాట్రిక్ తీయగా 17 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఆసీస్ బౌల‌ర్ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో హ్యాట్రిక్ తీయ‌డం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -