సుమన్ తేజ్, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో ‘సందేహం’ అనే మూవీ రూపొందింది. సతీష్ పరమవేద దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని విష్ణు వర్షిణి క్రియేషన్స్ బ్యానర్ పై సత్యనారాయణ పర్చా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాలో సుమన్ తేజ్, హెబ్బా పటేల్ తో పాటు ‘బిగ్ బాస్’ శ్వేతా వర్మ, రాశిక శెట్టి, బిగ్ బాస్ శుభ శ్రీ రాయగురు, శ్రీనివాస్ భోగిరెడ్డి, సుందర్ రావు పర్చా, చంద్రశేఖర్.. వంటి వారు కుడా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేసింది. మరి తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం రండి :
కథ : హర్ష(సుమన్ తేజ్) , శృతి(హెబ్బా పటేల్) ని అమితంగా ప్రేమిస్తాడు. పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. హర్ష..ది లవ్ మ్యారేజ్ అయ్యుండొచ్చు కానీ శృతికి మాత్రం అది అరేంజ్డ్ మ్యారేజ్ గానే చెప్పుకోవాలి. అందుకే ఫస్ట్ నైట్ రోజు అతనితో కలవదు. ఆ తర్వాత కూడా టైం కావాలంటుంది. ఈ క్రమంలో హర్ష లానే ఉన్న ఆర్య(సుమన్ తేజ్) ఎంట్రీ ఇస్తాడు. శృతి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటూ వీళ్ళ లైఫ్ లోకి ఎంట్రీ ఇస్తాడు. హర్ష, శృతి ఉండే అపార్ట్మెంట్ లోనే ఆర్య కూడా ఉంటాడు. ఇది హర్షకి నచ్చదు. అయితే శృతి కూడా తనని మోసం చేస్తుందేమో అని భావించి.. అసలు విషయం తెలుసుకోవడానికి బెంగుళూరు ట్రిప్ వేస్తాడు. తిరిగి వచ్చాక అతనికి కరోనా వచ్చింది అని తెలుస్తుంది. దీంతో అతన్ని హాస్పిటల్ లో అడ్మిట్ చేయగా.. చికిత్స పొందుతూ మరణించాడు అని డాక్టర్లు శృతికి చెబుతారు. ఆ తర్వాత ఏమైంది? శృతి… ఆర్యకి దగ్గరయ్యిందా? లేక హర్ష ప్రేమను తలుచుకుని కృంగిపోయిందా? వంటి సందేహాలు తీరాలంటే ఈ ‘సందేహం’ చూడాల్సిందే.
విశ్లేషణ : కథ పరంగా ఇది ప్రేక్షకులకి కొత్తగా ఏమీ అనిపించదు. ‘నిన్నుకోరి’ వంటి ఎన్నో సినిమాలు ఈ లైన్ తో వచ్చాయి. కానీ హీరో డబుల్ రోల్ చేయడం,కరోనా నేపధ్యాన్ని జోడించడం అనేది ఆసక్తిగా అనిపించే అంశం. మొదటి హాఫ్ ఎంగేజింగ్ గా ఉంది. ప్రీ ఇంటర్వెల్ నుండి సినిమా ఆసక్తిగా మారుతుంది. ఇంటర్వెల్ సీన్ అయితే సెకండ్ హాఫ్ పై మరింతగా ఆసక్తి పెరుగుతుంది.ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్ లు కొత్తగా అనిపిస్తాయి. ప్రీ క్లైమాక్స్, క్లయిమాక్స్ గ్రిప్పింగ్ గా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు కథకి తగ్గట్టు బాగానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీకి, పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి పేరు పెట్టాల్సిన పనిలేదు. దర్శకుడు సతీష్ పరమవేద గ్రిప్పింగ్ నేరేషన్ ప్రేక్షకుల్ని అలరిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే.. సుమన్ తేజ్ డబుల్ రోల్ ను ఛాలెంజింగ్ గా తీసుకుని కష్టపడ్డాడు. అతని కష్టం తెరపై కనిపిస్తుంది. హర్ష , ఆర్య పాత్రల్లో అతను చూపించిన వైవిధ్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హెబ్బా పటేల్ గ్లామర్ తోనే కాకుండా ఈ సినిమాలో నటనతో కూడా మంచి మార్కులు వేయించుకుంది.ఎమోషనల్ సీన్స్ లో కూడా తన హావభావాలతో ఆకట్టుకుంది. రాశిక శెట్టి కూడా , బిగ్ బాస్ శ్వేతా వర్మ కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు. ముఖ్యంగా శ్వేతా వర్మ పోలీస్ ఆఫీసర్ గా పవర్ ఫుల్ గా కనిపించి మంచి మార్కులు వేయించుకుంటుంది.
చివరి మాట : ‘సందేహం’ .. యూత్ ను.. మాత్రమే కాదు ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా కలిగిన చక్కటి కమర్షియల్ డ్రామా. సెకండాఫ్ కోసం కచ్చితంగా ఈ సినిమాని చూడాల్సిందే.
రేటింగ్ : 3 /5
