యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి 2898AD. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 27న ప్రేక్షకుల ముందుకురానుండగా సినిమా బుకింగ్స్‌కి మంచి స్పందన వస్తోంది. సినిమా కోసం రూ.500 కోట్ల బడ్జెట్ కాగా రూ.1000 కోట్ల వసూళ్లను అంచనా వేస్తున్నారు. టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో కల్కి వెయ్యి కోట్ల మార్క్‌ను దాటడం ఖాయమని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
నార్త్ మార్కెట్ లో అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే కల్కి కి ఓపెనింగ్ డే కి టాక్ తో సంబంధం లేకుండా ఈజీగా 20 కోట్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక్క హిందీ వెర్షన్ లోనే తొలిరోజు రూ.25 కోట్లు రాబట్టవచ్చని తెలుస్తోంది.
నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ లోనే 3 మిలియన్ డాలర్స్ గ్రాస్ మార్క్ ని దాటేసిందని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించింది.