- Advertisement -
అరటిపండు ఇష్టపడని వారుండరూ. పోషకాల గనిగా గుర్తింపు పొందిన అరటిపండును చిన్న పిల్లల దగ్గరి నుండి పెద్దల వరకు ఇష్టపడి తింటారు. అయితే అరటిపండు కంటే అరటికాయలో ఎక్కువ లాభాలు ఉన్నాయనే సంగతి చాలామందికి తెలియదు.
అరటికాయతో లాభాలు ఏంటో ఓ సారి పరిశీలిస్తే…జీర్ణక్రియ, ప్రేగు కదలికను మెరుగుపర్చడంలో సాయపడుతుంది. ఇందులో పొటాషియం, విటమిన్ బీ6,విటమిన్ సి ఉండటమే కాదు చక్కెర తక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం, ఇతర జీర్ణశయాంతర సమస్యలను తగ్గిస్తుంది.
అలాగే గుండె జబ్బులు, క్యాన్సర్, కంటిశుక్లం, వయస్సు సంబంధిత దృష్టి సమస్యలను నివారించడంలో సాయపడుతుంది. ఆకలిని అరికట్టడంలో, అతిగా తినడం తగ్గించడంలో ఉపయోగపడతాయి. బరువు పెరగడాన్ని నియంత్రించాలనుకునే వారికి అరటికాయ బెస్ట్ ఛాయిస్.
