- Advertisement -
ఉస్తాద్ రామ్ పోతినేని- డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్లాక్ బాస్టర్ మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి జగన్నాథ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొనగా సంజయ్ దత్ విలన్‌గా చేస్తుండటం భారీ హైప్ నెలకొంది.
ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కానుండగా ఇదే పెర్ఫెక్ట్ టైం…. ఈరోజు 50 రోజుల కౌంట్‌డౌన్‌ను మార్కింగ్ చేస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుండగా త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయనున్నారు.మణిశర్మ కంపోజ్ చేసిన ఎనర్జిటిక్ మాస్ సాంగ్ కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
