చర్మ సంరక్షణ కోసం రకరకాల క్రీములు వాడుతుంటాం..అయితే వీటిలో కొన్ని ఆ క్రీములను వాడినన్ని రోజులు బాగానే ఉంటుంది ఆ తర్వాత మళ్లీ యధాతథ పరిస్థితే. అయితే కొన్ని సహజమైన పద్దతుల ద్వారా శరీరాన్ని ప్రకాశవంతంగా ఉంచుకోవచ్చు.
ఇందులో ముఖ్యమైనవి చియా సీడ్స్. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు,యాంటీ ఆక్సిడెంట్‌లు అధికంగా ఉండటం కారణంగా చర్మాన్ని లోపల నుండి హైడ్రేట్ చేయడంతో పాటు చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది. అందుకే చర్మ సంరక్షణ కోసం దినచర్యలో చియా గింజలను భాగం చేసుకోవాలి.
సిట్రస్ గ్లో బూస్టర్ 1 టేబుల్ స్పూన్ చియా విత్తనాలు, సగం చెక్క నిమ్మరసం 2 కప్పుల నీళ్లు పోసి తాగడానికి 10 నిమిషాలు నానబెట్టి ఉదయాన్నే తాగితే మంచి ఫలితం ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ చియా గింజలను సగం దోసకాయ ముక్కలు, కొన్ని తాజా పుదీనా ఆకులను 2 కప్పుల నీటిలో కలపండి. గంట తర్వాత ఆ నీటిని తాగితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. గండి. 1 టేబుల్ స్పూన్ చియా గింజలను పైనాపిల్ ముక్కలు, తురిమిన అల్లం 2 కప్పుల నీటిలో కలిపి..15 నిమిషాల తర్వాత తాగితే మంచి ఫలితం ఉంటుంది.
