- Advertisement -
చాలారోజుల తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొంది. రీసెంట్‌గా మహారాజతో విజయ్ సేతుపతి అరదగొట్టగా తాజాగా కల్కితో ప్రభాస్ పాన్ ఇండియానే షేక్ చేస్తున్నారు. విడుదలైన 5 రోజుల్లోనే రూ.600 కోట్ల క్లబ్‌లో చేరింది కల్కి. ఈ వీకెండ్‌లో వెయ్యి కోట్ల మార్క్‌ను చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
అయితే కల్కి మూవీ వచ్చినా విజయ్ సేతుపతి మహారాజ వసూళ్లు ఆగడం లేదు. విజయ్ సేతుపతి కెరీర్‌లో ఇది 50వ సినిమా కాగా నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించారు. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది మహారాజా. ఇండియాలో 76 కోట్లు, ఓవర్సీస్ లో 25 కోట్ల వరకు రాబట్టింది.
ఇక తమిళ్‌లో కల్కి ఇప్పటివరకు రూ.40 కోట్లు వసూళ్లు చేయగా ఈ మూవీకి పోటినిస్తోంది మహారాజా. మొత్తంగా రెండు సినిమాలు బ్యాక్ టూ బ్యాక్‌గా వంద కోట్లు కలెక్ట్ చేయడం విశేషం.