పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ ర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. ఎప్పుడో ప్రారంభం అయిన ఈ సినిమా షూట్‌కి అనేక బ్రేక్‌లు పడుతూ వస్తుండగా పవన్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా చిత్రం ఇది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీగా వస్తున్న ఈ చిత్రంలో పవన్ బందిపోటుగా కనిపించనున్నారు.
ఇక ఎన్నికల నేపథ్యంలో సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడగా తాజాగా ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు పవన్. సినిమా షూటింగ్ 50 శాతం పూర్తి కాగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమా నుండి తప్పుకోగా జ్యోతి కృష్ణ మిగితా పార్ట్‌ని పూర్తి చేస్తున్నారు.
ఇక ఈ సినిమా షూటింగ్ ఆగస్టు మూడోవారంలో ప్రారంభం కానుండగా వారానికి రెండు రోజులు చొప్పున పవన్ షూటింగ్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి డేట్స్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తుండగా పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
