ఏపీలో వైసీపీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న హత్యాకాండకు నిరసనగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైసీపీ ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. వైసీపీ చేస్తున్న ఆందోళనకు మద్దతిచ్చారు యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్.
ఏపీలో వైసీపీ పార్టీ టార్గెట్గా దాడులు జరగడం సరికాదని సూచించారు. విపక్షాలపై అరాచకాలు సృష్టించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఒకరి ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదని… ప్రాణాలు తీయడం, హత్యలు చేయడం ప్రజాస్వామ్యంలో చెల్లవని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో కొత్తగా బుల్డోజర్ సంస్కృతి వచ్చిందని…ఈ దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు.
అత్యంత కఠిన పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తల కోసం జగన్ పోరాడుతున్నారని. ఏ పార్టీకి అయినా కార్యకర్తలే బలం అని చెప్పారు. జగన్ చేసే పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు అఖిలేష్. అలాగే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సైతం జగన్ చేస్తున్న ఆందోళనకు మద్దతిచ్చింది.
