ఏపీలో టీడీపీ కక్ష్యపూరిత రాజకీయాలు సాగిస్తోంది. ప్రధానంగా వైసీపీ నేతలే టార్గెట్‌గా దాడులు, హత్య రాజకీయాలకు పాల్పడుతు భయానక వాతావరణం సృష్టిస్తోంది. నేతలపై పోలీసులతో అక్రమ కేసులు బనాయిస్తు మానసికంగా కుంగదీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఓ వైపు కేసులు మరోవైపు జగన్ చేపట్టిన సంక్షేమ పథకాల పేర్లు ఎక్కడా కనిపించకుండా చేస్తున్నారు.
తాజాగా ఏపీలో పలు పథకాల పేర్లు మార్చారు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు.జగనన్న అమ్మ ఒడి పథకం పేరును తల్లికి వందనంగా, జగనన్న విద్యా కానుక పథకం పేరును సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా, జగనన్న గోరుముద్ద పథకం పేరును డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా మార్చారు. అలాగే మన బడి నాడు నేడు పథకాన్ని మన బడి మన భవిష్యత్తుగా, స్వేచ్ఛ పథకానికి బాలికా రక్షగా, జగనన్న ఆణిముత్యాలు పథకం పేరును అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చారు.
పథకాల పేరు మార్చడంపై మిశ్రమ స్పందన వస్తోంది. అయితే పథకాల పేరు మార్చి సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరును పెట్టడం గొప్ప నిర్ణయం అన్నారు.