యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాజా సాబ్. ఇటీవలె నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898ఏడీతో సక్సెస్ కొట్టిన ప్రభాస్ తాజాగా రాజాసాబ్తో అలరించేందుకు రెడీ అవుతున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం గ్లింప్స్‌తో పాటే రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. 2025 ఏప్రిల్ 10న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ గా విడుదల చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం.
గ్లింప్స్ లో ప్రభాస్ కారుకు ఉన్న మిర్రర్ లో స్టైలిష్ నవ్వుతో కనిపించడం , ఆ నవ్వుకు పూల వర్షం కురిపించడం మరో హైలెట్. ఇప్పటికే 40% చిత్రీకరణ పూర్తికాగా ఆగస్టు 2 నుండి మరో భారీ షెడ్యూల్ ప్రారంభం కానుంది. తమన్ సంగీతం అందిస్తుండగా రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ మరియు కింగ్ సోలమన్ ఫైట్ కొరియోగ్రాఫీ అందిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది రాజాసాబ్. ఈ సినిమా గ్లింప్స్ అందరిని ఆకట్టుకుంటుండగా మీరు కూడా ఈ గ్లింప్స్‌పై లుక్ వేయండి..