Saturday, May 3, 2025
- Advertisement -

బీఆర్ఎస్ రివర్స్ గేమ్..సొంతగూటికి ఎమ్మెల్యేలు!

- Advertisement -

ఇప్పటివరకు ఆపరేషన్ ఆకర్ష్‌,అభివృద్ధి కోసం పార్టీ మార్పు అంటూ ఫిరాయింపులకు పాల్పడ్డాయి అన్ని పార్టీలు. ఇక తెలంగాణలో మేజిక్ ఫిగర్‌కు కేవలం 4 స్థానాలు మాత్రమే ఎక్కువ దక్కించుకున్న కాంగ్రెస్, అధికారాన్ని కొల్పోకుండా ముందు జాగ్రత్త చర్యగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక మొదలు కాగా ఇప్పటివరకు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు.

వీరి బాటలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని బీఆర్ఎస్‌ఎల్పీ ,…కాంగ్రెస్‌లో విలీనం అయ్యే వరకు ఈ చేరికలు ఉంటాయని ప్రచారం జరిగింది. అయితే కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల చేరికలకు బ్రేక్ పడగా తాజాగా ఆపార్టీకి మరోషాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ మొదలు పెట్టిర రివర్స్‌గేమ్‌లో భాగంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్‌లో చేరారు. ఇకపై బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని కేటీఆర్‌కు స్పష్టం చేశారు కృష్ణమోహన్ రెడ్డి. ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

వీరిబాటలోనే కాంగ్రెస్‌లో చేరిన మరికొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. ఓ దశలో బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ చేపట్టిన రివర్స్ ఎటాక్‌తో సీఎం రేవంత్ రెడ్డి ఏవిధంగా స్పందిస్తారో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -