అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం పుష్ప. ఈ సినిమాకు సీక్వెల్ వస్తున్న పుష్ప 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబరు 6న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుండగా ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్, టీజర్‌లకు అదిరే రెస్పాన్స్ రాగా సెకండ్ లిరికల్ సైతం అదుర్స్ అనిపించింది.
మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోండగా బన్నీ సరసన రష్మికా హీరోయిన్‌గా నటిస్తోంది. ఫాహిల్ ఫజిద్, అనసూయ,సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
రోజురోజుకు సినిమాపై అంచనాలు పెరుగుతుండగా తాజాగా క్లైమాక్స్‌కు సంబంధించి ఆసక్తికర వార్త బయటికొచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. హీరో అల్లు అర్జున్‌తో పాటు సినిమాలోని కీలక నటులు పాల్గొంటుండగా ఈ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయి. ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయమని ప్రచారం జరుగుతుండటంతో సినిమా రిలీజ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.