Saturday, May 3, 2025
- Advertisement -

వయనాడ్‌ బాధితులకు ప్రభాస్ రూ.2 కోట్ల విరాళం

- Advertisement -

భారీ వర్షాలతో కేరళా అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వయనాడ్‌ దారుణంగా దెబ్బతింది. కొండచరియలు విరిగి పడటంతో భారీ నష్టం సంభవించగా ఇప్పటికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున సినీ నటులు ముందుకొస్తున్నారు. ఇప్పటివరకు మెహన్ లాల్, చిరంజీవి, మమ్ముట్టి, సూర్య-జ్యోతిక,అల్లు అర్జున్‌ తదితరులు తమవంతు సాయాన్ని అందించారు.

తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముందుకొచ్చారు. తాజాగా ప్రభాస్.. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీ విరాళం అందించాడు. ఏకంగా రూ.2 కోట్లు విరాళంగా ప్రకటించగా ప్రభాస్ పెద్ద మనసుకు అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కొండచరియలు విరిగిపడటం, వరదలు బీభత్సం సృష్టించడంతో 350 కి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరెందరో శిథిలాల కింద సజీవ సమాధి అయిపోయారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -