Sunday, May 4, 2025
- Advertisement -

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్..అదిరే అప్‌డేట్

- Advertisement -

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌, బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌ కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కనుంది. అలాగే ప్రశాంత్ నీల్‌తో సినిమాకు కమిట్ అయ్యారు ఎన్టీఆర్. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న ఈ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ చిత్రం లాంఛ‌నంగా ప్రారంభమైంది. అలాగే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. జ‌న‌వ‌రి 9, 2026 వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానుంది.

మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ప్రశాంత్ నీల్. దీనికి ఎన్టీఆర్ తోడవుతుండటంతో ఇండియ‌న్ సినీ హిస్టరీలో ఈ మూవీ సరికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తుంద‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. కెజియ‌ఫ్ త‌ర‌హా ఓ స‌రికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించ‌నున్నారు మేక‌ర్స్.

మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌, న‌వీన్ ఎర్నేని, ర‌వి శంక‌ర్ ఎల‌మంచిలి, హ‌రికృష్ణ కొస‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోండగా ర‌వి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు.త్వరలోనే మిగితా నటీనటుల వివరాలను వెల్లడించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -